AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు.. ఏ సమయాల్లో తాగితే మంచిదో తెలుసా..?

Lots of Benefits With Buttermilk : 'మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన' అనే సామెత వినే ఉంటాం. సామెత గురించి తెలియదు కానీ పలుచటి మజ్జిగతో మాత్రం చాలా

మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు.. ఏ సమయాల్లో తాగితే మంచిదో తెలుసా..?
Lots Of Benefits With Butte
uppula Raju
|

Updated on: Mar 15, 2021 | 9:04 PM

Share

Lots of Benefits With Buttermilk : ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అనే సామెత వినే ఉంటాం. సామెత గురించి తెలియదు కానీ పలుచటి మజ్జిగతో మాత్రం చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి మజ్జిగ చాలా అవసరం. ఈ పానీయం బాడీకి చేసే మేలు అంతా ఇంతా కాదు. కూల్‌ డ్రింక్స్‌ కంటే సహజ ఆహారం మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు. వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా తాగితే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

1. వేస‌విలో చ‌ల్ల చ‌ల్లగా మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎండ‌కు వెళ్లి వ‌చ్చే వారు ఇంటికి చేరుకోగానే చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌లో నిమ్మ‌కాయ పిండుకుని తాగితే ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం తీరుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తూకంలో ఉంటాయి. 2. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మ‌జ్జిగ‌లో ఉండే బ‌యోయాక్టివ్ సమ్మేళ‌నాలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రిస్తాయి. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 3. కాల్షియం లోపం ఉన్న‌వారు మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కాల్షియం అందుతుంది. త‌ద్వారా ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి. 4. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. 5. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి. 6.పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

Krishna Saagar Rao : జనసేనకి నిబద్ధత లేదు, వాళ్లతో లోపాయికారీ ఒప్పందం : తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి

ఈ ఏడాది 71.01 లక్షల ఈపీఎఫ్ ఖాతాలు మూసివేత.. పార్లమెంట్‌లో ప్రకటించిన కేంద్రమంత్రి సంతోష్‌ గంగ్వార్‌

Aamir Khan : అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాను విడిచిపెడుతున్నట్లు ప్రకటన.. ఎందుకో తెలుసా..