AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan : అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాను విడిచిపెడుతున్నట్లు ప్రకటన.. ఎందుకో తెలుసా..

Aamir Khan Quits Social Media : బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు

Aamir Khan : అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాను విడిచిపెడుతున్నట్లు ప్రకటన.. ఎందుకో తెలుసా..
Aamir Khan Quits Social Med
uppula Raju
|

Updated on: Mar 15, 2021 | 8:42 PM

Share

Aamir Khan Quits Social Media : బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇన్ని రోజులు తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. దీంతో అతడి అభిమానులు ఒక్కసారిగా షాకింగ్‌కి గురయ్యారు. అమీర్ తన 56 వ పుట్టినరోజును ఆదివారం జరుపుకున్నారు. తను సోషల్ మీడియాను విడిచిపెడుతున్నట్లు ప్రకటించడానికి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి చివరి పోస్ట్ పెట్టారు.

అయితే అభిమానులు ఈ విషయం గురించి చింతించవద్దని తాను ఎల్లప్పుడు అందరికి అందుబాటులో ఉంటానని తెలిపారు. తన సినిమాల సమాచారం కోసం అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అధికారిక సైట్‌ను సందర్శించవచ్చని తెలిపాడు. ”నా పుట్టిన రోజున మీరు చూపించిన అభిమానంతో నా నా హృదయం నిండిపోయింది. నేను చలా సంతోషంగా ఉన్నాను. ఇక ఇదే నా చివరి పోస్ట్.. ఇప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. ఇక ఇదే నా చివరి పోస్ట్ అంటూ కామెంట్ పెట్టాడు. అంతేకాకుండా ఏది ఏమైనప్పటికి ఎప్పటిలాగే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను బాయ్ అంటూ పోస్ట్ పెట్టాడు” అయితే .. అమీర్ ఖాన్ చైనా ఫ్యాన్స్ బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో కేక్ కట్ చేశారు.

అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెల్సిందే. చక్కటి కథాంశం తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. రాజ్కుమార్ హిరానీ  ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాత విదు వినోద్ చోప్రా  పీకే ను నిర్మించాడు. 2014 లో విడుదలైన పీకే అప్పటికి ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. సంజయ్ దత్, అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్  నటించిన ఈ సినిమాలో అమీర్ అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసి గా నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ  సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతుందని సమాచారం.

Viral Video : నడిరోడ్డు పై జలలాట.. ఇంతలో ఊహించని సంఘటన.. నవ్వులు పూయిస్తున్న వీడియో

వినియోగదారులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. 120 రోజుల ముందుగానే పార్శిల్‌ బుక్‌ చేసుకునేందుకు వీలు..!