Krishna Saagar Rao : జనసేనకి నిబద్ధత లేదు, వాళ్లతో లోపాయికారీ ఒప్పందం : తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి
Krishna Saagar Rao : తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చి టీఆర్ఎస్ అభ్యర్థికే తమ మద్దతంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న చేసిన..

Ts Bjp Spokes Person
Krishna Saagar Rao : తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చి టీఆర్ఎస్ అభ్యర్థికే తమ మద్దతంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. పవన్ ప్రకటనపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జనసేన పార్టీకి నిబద్ధత లేదంటూ నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు. ఆ పార్టీతో తమకు ఎలాంటి పొత్తూ లేదన్నారాయన. వాళ్ల బలమెంతో తెలుసుకోకుండా.. తమపై విమర్శలు చేస్తున్నారని తప్పు పట్టారు. TRSతో జనసేన లోపాయికారీ ఒప్పందం చేసుకుందని కృష్ణసాగర్‌రావు ఘాటు విమర్శలు చేశారు.
Read also :