Bank employees strike : రెండు రోజులంతే, హైదరాబాద్ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన
Bank employees strike : ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో హైదరాబాద్ కోఠి బ్యాంక్ స్ట్రీట్ లో..
Bank employees Two Days strike : ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో హైదరాబాద్ కోఠి బ్యాంక్ స్ట్రీట్ లో అన్ని ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెలో భాగంగా కోఠి లోని ఎస్.బి.ఐ ప్రధాన కార్యాలయంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బ్యాంక్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
డప్పు చప్పుడులతో మహిళా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు పదిలక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన పరిస్థితి బీజేపీ ప్రభుత్వంలో రావడంపై యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటికరణ చేసే ప్రతిపాదనను ఉపసహరించుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లపై రెండు రోజుల సమ్మె తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరాక పోతే ప్రజా ఉద్యమంగా మార్చుతామని వారు హెచ్చరించారు.
Read also :