సామలు తింటే ఎన్ని ఉపయోగాలు తెలిస్తే ఖచ్చితంగా 10 కేజిలు కొంటారు.. ఆరోగ్యానికి అమృతమే..!
సామలలో ఫాస్పరస్ ఉంటుంది, ఇది కొవ్వుల జీవక్రియ, శరీర కణజాలాల మరమ్మత్తు, శక్తి ఉత్పత్తికి సహాయపడుతుంది. మానవ శోషరస వ్యవస్థను శుద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, సామలు మెదడు, గొంతు, రక్తం, థైరాయిడ్, క్లోమ గ్రంథి క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

సామలు అనేవి చిరుధాన్యాల కోవకు చెందిన ఒక రకమైన గింజలు. వీటిని ఆంగ్లంలో లిటిల్ మిల్లెట్ అంటారు. భారతదేశంలో వీటిని అనేక ప్రాంతాల్లో పండిస్తారు, ఆహారంగా ఉపయోగిస్తారు. సామలు అద్భుతమైన సిరి ధాన్యాలు. వీటి ఉపయోగంతో శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పీచు పదార్థం, ఖనిజాలు విటమిన్లు, పుష్కలంగా ఉంటాయి. సామలు సహజంగా గ్లూటెన్ రహితమైన ఆహారం. గ్లూటెన్ పడని వారికి ఇది ఉత్తమమైన ఎంపిక. గోధుమలు, బార్లీ వంటి వాటికి బదులుగా సామల వాడకంతో జీర్ణ సంబంధిత సమస్యలు రావు. గ్లూటెన్ లేని ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక.
సామలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను సాఫీగా చేస్తుంది. సామలలో మెగ్నీషియం ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ B3 (నియాసిన్) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. సామలు తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. కాబట్టి, మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకోవడం చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
సామలలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బి విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా ఉండటానికి శరీరంలోని ఇతర ముఖ్యమైన విధులకు తోడ్పడతాయి. సామలలో ఫాస్పరస్ ఉంటుంది, ఇది కొవ్వుల జీవక్రియ, శరీర కణజాలాల మరమ్మత్తు, శక్తి ఉత్పత్తికి సహాయపడుతుంది. మానవ శోషరస వ్యవస్థను శుద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, సామలు మెదడు, గొంతు, రక్తం, థైరాయిడ్, క్లోమ గ్రంథి క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








