Chandra Grahan 2025: చంద్రగ్రహణం వేళ సూతక కాలం అంటే ఏంటి..? పాటించాల్సిన నియమాలు, చేయాల్సిన దానాలు ఇవే..!
అయితే, చంద్రగ్రహణం వేళ సూతక కాలం 9 గంటల ముందు మధ్యాహ్నం 12.57 గంటలకు ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కుంభ రాశి, పూర్వాభాద్రపద నక్షత్రంలో సంభవించే పూర్తి చంద్రగ్రహణం అవుతుందని పండితులు విశ్లేషిస్తున్నారు. గ్రహణ సమయం, సూతక కాలంలో చేయాల్సిన పనులు, పాటించాల్సిన నియామాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2025 సంవత్సరంలో రెండవ చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న జరగబోతోంది. అంటే ఇవాళే..! అవును ఇవాళే ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఈ యేడాది సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇవాళ (ఆదివారం 7న) రాత్రి 9:58 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ(సోమవారం) తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది. దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగనున్న ఈ చంద్రగ్రహణం అత్యంత పొడవైనదిగా చెబుతున్నారు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, న్యూజిలాండ్, యూరప్ దేశాల్లోనూ ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, చంద్రగ్రహణం వేళ సూతక కాలం 9 గంటల ముందు మధ్యాహ్నం 12.57 గంటలకు ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కుంభ రాశి, పూర్వాభాద్రపద నక్షత్రంలో సంభవించే పూర్తి చంద్రగ్రహణం అవుతుందని పండితులు విశ్లేషిస్తున్నారు. గ్రహణ సమయం, సూతక కాలంలో చేయాల్సిన పనులు, పాటించాల్సిన నియామాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
చంద్రగ్రహణానికి ముందు చేయాల్సిన పనులు:
ఈ చంద్రగ్రహణం పితృ పక్షాన్ని కూడా ప్రారంభిస్తోందని పండితులు చెబుతున్నారు. ఇది అరుదైన యాదృచ్చికం అంటున్నారు. చంద్రగ్రహణంలోని సూతక కాలం మధ్యాహ్నం 12:57 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి, అవసరమైన మతపరమైన పనులను ఉదయాన్నే పూర్తి చేయడం మంచిదని చెబుతున్నారు. సూతక కాలం ప్రారంభమయ్యే ముందు ఆలయంలో పూజ, జపం, ధ్యానం వంటి పనులు చేయడం సరైనది కాదని చెబుతున్నారు. పూర్ణిమ శ్రాద్ధం కూడా సెప్టెంబర్ 7న వస్తుంది. కాబట్టి పూర్వీకులకు తర్పణం, పిండందానం ఉదయాన్నే పూర్తి చేయాలని చెప్పారు.. తులసి ఆకులను కూడా ముందుగానే కోసి పెట్టుకుని, వాటిని ఆహారం, నీటిలో వేసుకోవాలని చెబుతున్నారు.
పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు సుతక కాలం నుండి మినహాయింపు:
చంద్రగ్రహణానికి సంబంధించిన సూతక కాలం ఈరోజు మధ్యాహ్నం 12:57 నుండి ప్రారంభమవుతుంది. అయితే, ఈ నియమం అందరికీ సమానంగా వర్తించదని చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక మినహాయింపు ఉంటుంది. వారికి, సూతక ప్రభావం సెప్టెంబర్ 7 సాయంత్రం 6:35 గంటల నుండి పరిగణించబడుతుందని చెబుతారు. చంద్రగ్రహణం ముగిసిన వెంటనే, సూతక ప్రభావం కూడా అదే సమయంలో ముగుస్తుందని చెబుతున్నారు.
చంద్రగ్రహణం తర్వాత దానం ప్రాముఖ్యత:
చంద్రగ్రహణం ముగిసిన తర్వాత పేదలకు ఆహారం, బట్టలు లేదా ఉపయోగకరమైన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా నిపుణులు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత, మీరు మీ సామర్థ్యం మేరకు బియ్యం, పాలు, చక్కెర, నెయ్యి, బట్టలు లేదా వెండిని దానం చేయవచ్చునని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో లభించే సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి…




