శరీరంలోని ఈ భాగంలో దురదగా ఉంటే నిర్లక్ష్యం చేయకండి.. అది ఖచ్చితంగా కాలేయం దెబ్బతింటుందని అర్థం..!
అయితే ప్రస్తుత ఆహారం, ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది కాలేయం చెడిపోవడం, ఊపిరితిత్తులు చెడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో కాలేయం చెడిపోతే, కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం..

శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం. మానవ శరీరానికి గుండె, మెదడు ఎంత ముఖ్యమో కాలేయం కూడా అంతే ముఖ్యం. కాలేయం ప్రభావితమైతే మొత్తం శరీరం అంతా ప్రభావితమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కాలేయ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాలేయం చెడిపోతే దాన్ని బాగుచేయలేము.. అయితే ప్రస్తుత ఆహారం, ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది కాలేయం చెడిపోవడం, ఊపిరితిత్తులు చెడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో కాలేయం చెడిపోతే, కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం..
అరికాళ్ళపై దురద: కాలేయం దెబ్బతిన్నప్పుడు అరికాళ్ళు తరచుగా దురదగా మారుతాయి. ఈ దురద తేలికగా తగ్గదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే విస్మరించకూడదని నిపుణులు చెబుతున్నారు.
అరికాళ్ళలో వాపు, నొప్పి: కొంతమందికి తరచుగా పాదాల అడుగు భాగంలో లేదా అరికాళ్ళలో వాపు, నొప్పి వస్తుంది. ఇటువంటి లక్షణాలను విస్మరించకూడదు. ఎందుకంటే కాలేయంలో ఏదో లోపం ఉందని సంకేతంగా అర్థం చేసుకోవాలి. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే, కాలేయం క్షీణించడం ప్రారంభమవుతుంది.
పాదాలలో దుర్వాసన: పాదాలలో ముఖ్యంగా అరికాళ్ళలో తరచుగా దుర్వాసన వస్తుంటే దానిని విస్మరించకూడదని నిపుణులు చెబుతున్నారు. పాదాలలో దుర్వాసన కాలేయ వ్యాధి లక్షణం కావచ్చు అంటున్నారు నిపుణులు.
కాలి గోళ్ళలో తెల్లటి రంగు: గోళ్ళు తెల్లగా మారడం ప్రారంభిస్తే అది కాలేయం దెబ్బతిన్నదానికి సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు.. ఈ లక్షణాలన్నీ ఇతర కారణాల వల్ల సంభవించవచ్చు. అయితే అలాంటి సందర్భాలలో వైద్యుడిని సంప్రదించడం అవసరం.
కాలేయ ఆరోగ్యానికి, పౌల్ట్రీ, సీఫుడ్, బీన్స్ వంటి తక్కువ కొవ్వు ప్రోటీన్ ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








