AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kandankaya: ఇన్నాళ్లు దీని టేస్ట్ మీకు తెలిసి ఉండదు.. ఇలా వండితే ప్లేట్‌‌ని కూడా వదిలిపెట్టరు

కందన కాయలు చికెన్ కర్రీలో వస్తేనే కొందరు పక్కన పెట్టేస్తారు. కానీ ఇలా ఓన్లీ కందన కాయలతోనే ఫ్రై చేసి చూడండి... వహ్వా అనాల్సిందే.

Kandankaya: ఇన్నాళ్లు దీని టేస్ట్ మీకు తెలిసి ఉండదు.. ఇలా వండితే ప్లేట్‌‌ని కూడా వదిలిపెట్టరు
Chicken Gizzard
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2023 | 4:21 PM

Share

చికెన్‌ను రకరకాలుగా వండి తింటారు. కొంతమంది పులుసు పెట్టుకుంటారు.. ఇంకొందరు ఫ్రై చేసుకుంటారు. ఇగురు మాదిరి చేసి.. ఇష్టంగా తినేవాళ్లు కూడా ఉంటారు. ఇక చికెన్ చట్నీ పెట్టుకుని డైలీ ఇంత లాగించేవాళ్లు కూడా చాలామంది ఉంటారు. అయితే కొందరు చికెన్ లివర్‌పై మక్కువ చూపిస్తారు. చాలా తక్కువమంది కందన కాయలను ఇష్టపడతారు. కొంతమంది వీటినే చికెన్ కిడ్నీలు అని కూడా అంటారు. ఆ కందనకాయల ఫ్రై ఎలా చెయ్యాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా కందన కాయలు తెచ్చుకున్నాక దానిపైన ఉన్న స్కిన్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత కందన కాయలను చిన్న, చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. కొందరు ఆ కాయలను అలానే వండేస్తారు. ఎవరిష్టం వారిది. ఇక ఫస్ట్ ఉల్లిగడ్డలు.. కేజీ కందనకాయలు మీరు తెచ్చుకున్నారు అనుకోండి.. అందులోకి నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు వినియోగించాలి. వాటిని నీట్‌గా తరిగి పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా ఓ 10 పచ్చి మిరపకాయలు తీస్కోని.. ఒక్కోదాన్ని రెండుగా చీల్చాలి. ఇక కొంత కర్వేపాకు కూడా రెడీ చేసుకోవాలి. అలానే ఓ 4 టమాటాలు కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి.

తయారీ విధానం…

పొయ్యిపై కళాయి పెట్టి.. అందులో 50 గ్రామలు ఆయిల్ వెయ్యాలి. ఆయిల్ వేడెక్కగానే.. కట్ చేసిన ఉల్లిపాయలు ముందుగా వేయాలి. వాటిని దోరగా వేయించాలి. ఆ తర్వాత అందులో ఓ టేబుల్ స్పూన్ పసుపు.. ఒకటిన్నర సర్వింగ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైతే కళాయికి అంటుకు పోతుంది అనిపించిందో.. అప్పుడు.. కందన కాయలు వేసుకోవాలి. ఆపై ఫుల్‌గా కలిపేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాడకూడదు. మాడితే టేస్ట్ అనేది పోతుంది. ఆపై మీ రుచికి తగ్గట్లుగా ఉప్పు వేయాలి. ఆపై మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో కూరను కలుపుతూ ఉండాలి. మూత కూడా కరెక్ట్‌గా ఫిక్స్ అయ్యేది పెట్టాలి. అప్పుడు ఆవిరి రూపంలో కర్రీలో నీరు తయారవుతుంది. ఈ విధంగా ఉడికిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. కూర ఉడికింది అనిపించాక.. అందులో కట్ చేసిన టమాటాలు వేయాలి. ఆపై బాగా కలపాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ కారం వేయాలి. అలానే ఓ టేబుల్ స్పూన్ దనియాల పొడి, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. అనంతరం దాన్ని బాగా కలిపేసి.. మళ్లీ మూత పెట్టాలి. అప్పుడు ఆవిరికి టమాటాల నుంచి కూడా వాటర్ వస్తుంది. మధ్యమధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. కూర బాగా దగ్గరిగా అయిన తర్వాత.. ముందుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, కర్వేపాకు వేయాలి. ఆ తర్వాత బాగా ఫ్రై అయ్యేంవరకు కూరను కలుపుతూ ఉండాలి. ఇక లాస్ట్‌కి గరం మసాలా(చెక్క, లవంగం, యాలుకుల పొడి) ఓ టేబుల్ స్పూన్ వేసి.. మళ్లీ కూరను కలుపుకోవాలి. కర్రీ కొంచెం లైట్ బ్లాక్ వచ్చేవరకు వేపుకోవాలి. ఆ తర్వాత దించేముందు కొత్తమేర వేసుకోవాలి. అంతే.. నోరూరించే కందనకాయల ఫ్రై రెడీ.

మరిన్ని కుకింగ్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..