AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు అతను నా దగ్గర పనిచేస్తున్నాడు.. స్టార్ హీరో కామెంట్స్..

చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ఏకైక విలక్షణ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత 'రియల్ స్టార్' ఉపేంద్ర. సినిమా అంటే కేవలం నలుగురు రౌడీలను కొట్టడం, పాటలు పాడుకోవడం మాత్రమే కాదు.. సమాజంలోని లోపాలను, మనుషుల మనస్తత్వాలను వెండితెరపై చూపించడమే అని నిరూపించిన మేధావి ఆయన. తెలుగులో కూడా ఈయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్లట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Tollywood : ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు అతను నా దగ్గర పనిచేస్తున్నాడు.. స్టార్ హీరో కామెంట్స్..
Upendra
Rajitha Chanti
|

Updated on: Jun 05, 2026 | 2:19 PM

Share

సూపర్ స్టార్ ఉపేంద్ర గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో తన సినీ ప్రస్థానం, జీవితానుభవాలు, విలక్షణమైన ఆలోచనలను పంచుకున్నారు. ఆయన సినిమాల్లో కనిపించే తీవ్రతకు భిన్నంగా బయట చాలా సాఫ్ట్ స్పోకెన్‌గా ఉంటారు. తన సినిమాలలో సమాజం, పాలకులతో సహా అన్ని వర్గాలపై వ్యంగ్యాన్ని ప్రదర్శించడం తన ప్రత్యేక శైలి అని ఉపేంద్ర వివరించారు. ఈ కన్విక్షన్ ఎక్కడి నుండి వచ్చిందని అడిగినప్పుడు, తాను ప్రేక్షకుల కోణంలో ఆలోచిస్తానని, ఒక దర్శకుడిగా కాకుండా, ఒక సాధారణ వ్యక్తిగా “ఇది బాగుంటుంది” అనిపించినప్పుడు ముందుకు వెళ్తానని చెప్పారు. ఆలోచిస్తే భయమేస్తుందని, కొన్నిసార్లు బ్లైండ్‌గా నమ్మకంతో ముందుకు సాగుతానని తెలిపారు. ఏ ఉపేంద్ర వంటి విజయవంతమైన చిత్రం తర్వాత పదేళ్ల విరామం తీసుకున్న ఉపేంద్ర, ఆ తర్వాత ఏం చేయాలో తెలియక నటనపై దృష్టి సారించానని వెల్లడించారు. తిరిగి దర్శకత్వం చేయాలనుకున్నప్పుడు, ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక బలమైన ఆలోచన ఉండాలని భావించానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు మన దేశం ఎందుకు ఇలా లేదు అని కలిగిన ఆలోచన, తన స్క్రీన్ ప్లేకి ప్రేరణ అయ్యిందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

ఉపేంద్ర తన జీవితాన్ని జీరో నుండి ప్రారంభించానని, కోల్పోవడానికి ఏమీ లేదని, అందుకే ప్రతి విజయం తనకు అదనపు లాభమేనని తన సానుకూల దృక్పథాన్ని వివరించారు. తన సినీ ప్రస్థానంలో ఎదురైన రెండు ముఖ్యమైన సంఘటనలను ఆయన పంచుకున్నారు. మొదటిది: అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక ప్రొడక్షన్ బాయ్ తనకు భోజనం నిరాకరించడం. అదే ప్రొడక్షన్ బాయ్ తర్వాత తాను హీరోగా నటించిన చిత్రంలో పనిచేశాడని, అయినా తాను అతనికి అదే గౌరవం ఇచ్చానని ఉపేంద్ర తెలిపారు. “ఆ సమయంలో నా పరిస్థితి అలా ఉంది, అందుకే అతను అలా ప్రవర్తించాడు. ఇప్పుడు నేను ప్రతీకారం తీర్చుకోవడం అర్థరహితం” అని ఆయన అన్నారు. “ఒక వ్యక్తిలోని చేదు అతనిని చేదుగా కాకుండా మెరుగైన వ్యక్తిగా మార్చాలి” అనే తత్వశాస్త్రం తన జీవితాన్ని ప్రభావితం చేసిందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

రెండవ సంఘటన: తన మొదటి చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రచయితగా, నటుడిగా పనిచేసినప్పటికీ, తన టైటిల్ కార్డ్ ప్రచురించబడలేదు. అప్పుడు తన లోపల, “నా టైటిల్ కావాలని అడుగు” అని ఒక స్వరం వినిపించిందని, కానీ తాను దానిని పట్టించుకోలేదని తెలిపారు. “ఉపేంద్ర అని ఎవరికి తెలుసు? టైటిల్ వేసుకున్నా ఉపయోగం లేదు” అని వదిలేశానని చెప్పారు. ఆ తర్వాత చిత్ర దర్శకుడు స్వయంగా తన కోసం ఒక ప్రత్యేక టైటిల్ కార్డ్‌ను రూపొందించారని, “వద్దు” అని అనుకున్నప్పుడు కూడా తన ప్రయత్నం లేకుండానే దానంతటదే జరిగిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటనల ద్వారా ఉపేంద్ర, జీవితంలో ప్రతికూల అనుభవాలను సానుకూలంగా మలుచుకోవడం, నిజాయితీగా పని చేయడం, ఫలితాలను ఆశించకుండా ఉండడం వంటి తన జీవన విధానాన్ని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

Follow Us
ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..
ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..
‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..
‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..
బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..
బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..
జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే..
జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇంట్లో సిరుల పంట!
లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇంట్లో సిరుల పంట!
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
చైన్‌తో కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..
చైన్‌తో కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..
పుల్ల పుల్లగా కారంగా.. పిల్లలకు ఎంతో నచ్చే బొరుగుల గొట్టం మిక్చర్
పుల్ల పుల్లగా కారంగా.. పిల్లలకు ఎంతో నచ్చే బొరుగుల గొట్టం మిక్చర్
Optical Illusion: మీ డేగ కళ్లకు 30 సెకన్ల ఛాలెంజ్..
Optical Illusion: మీ డేగ కళ్లకు 30 సెకన్ల ఛాలెంజ్..