AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Care: మధుమేహం బాధితులకు గుడ్‌న్యూస్‌.. చక్కెర స్థాయి తగ్గాలంటే.. ఈ మూడు రకాల జ్యూస్‌లు తాగండి

Control Blood Sugar: ఆధునిక కాలంలో మధుమేహం క్రమంగా పెద్ద వ్యాధిగా మారుతోంది. ప్రతి ఐదుగురిలో ఒకరికి మధుమేహం సమస్య వేధిస్తోంది. మధుమేహం

Diabetes Care: మధుమేహం బాధితులకు గుడ్‌న్యూస్‌.. చక్కెర స్థాయి తగ్గాలంటే.. ఈ మూడు రకాల జ్యూస్‌లు తాగండి
Healthy Juices
Shaik Madar Saheb
|

Updated on: Nov 16, 2021 | 5:17 PM

Share

Control Blood Sugar: ఆధునిక కాలంలో మధుమేహం క్రమంగా పెద్ద వ్యాధిగా మారుతోంది. ప్రతి ఐదుగురిలో ఒకరికి మధుమేహం సమస్య వేధిస్తోంది. మధుమేహం ప్రధానంగా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. ఈ పరిస్థితిలో.. రక్తంలో చక్కెర స్థాయిలను సకాలంలో నియంత్రించకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తు్న్నాయి. అయితే.. మధుమేహ బాధితులు కొన్ని ఇంటి చిట్కాలతో మీ బ్లడ్ షుగర్‌ స్థాయిని నియంత్రించుకోవచ్చు.

కాకరకాయ రసం: మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా ఇందులో థయామిన్, రిబోఫ్లావిన్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ కూరగాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఉదయం వేళ పరగడుపున కాకరకాయ జ్యూస్ తాగాలి.

టమాటో రసం: దాదాపు మనం తినే ఆహార పదార్థాల్లో టమోటాలు ఉంటాయి. టొమాటోలు ఆహార రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అయితే మధుమేహాన్ని తగ్గించడంలో టమోటాలు మంచివని మీకు తెలుసా? టొమాటోలో ప్యూరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు టమోటా రసం తాగడం మంచిది.

దోసకాయ రసం: ఆహారంలో దోసకాయను చేర్చుకోవాలని వైద్యులు మనందరికీ సలహా ఇస్తుంటారు. ఎందుకంటే దోసకాయ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వాటిలో మామూలు దోస అయినా.. కీర దోస అయినా మంచిదే. దోసలో నీరు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోసకాయ కూడా చాలా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? నిజానికి, ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు రోజూ దోసకాయ రసం తాగడం మంచిది.

Also Read:

Tulsi Side Effects: ఆరోగ్యానికి మంచిదని తులసి ఆకులను తింటున్నారా ? అయితే జాగ్రత్త..