Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Side Effects: ఆరోగ్యానికి మంచిదని తులసి ఆకులను తింటున్నారా ? అయితే జాగ్రత్త..

హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి చెట్టు ఎంతో పవిత్రంగా భావిస్తారు. రోజు ఉదయాన్నే

Tulsi Side Effects: ఆరోగ్యానికి మంచిదని తులసి ఆకులను తింటున్నారా ? అయితే జాగ్రత్త..
Tulsi
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 16, 2021 | 4:51 PM

హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి చెట్టు ఎంతో పవిత్రంగా భావిస్తారు. రోజు ఉదయాన్నే.. సాయంత్ర సమయంలో దీపారాధన చేయడం హిందూ సంప్రదాయం. తులసి చెట్టును లక్ష్మీ దేవిగా భావిస్తారు. పూజలకు.. ప్రత్యేక శుభకార్యాలకు తులసి చెట్టును పూజించడం ఆనవాయితి. కేవలం ఆద్యాత్మికంగానే కాకుండా.. ఆయుర్వేదం.. చికిత్స పరంగానూ తులసి చెట్టుకు ఎంతో ప్రాదాన్యత ఉంది. ఈ చెట్టు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహయపడుతుంది. చాలా సంవత్సరాలుగా పలు వ్యాధులు చికిత్సలో ఆయుర్వేదంలో ఈ తులసిని ఉపయోగిస్తుంటారు. రోజూ ఉదయాన్నే తులసి చెట్టు ఆకులు తింటే రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను తగ్గుతాయి అంటారు. తులసి చెట్టు వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ అధికంగా తీసుకుంటే హానీకరంగా మారుతుంది. అవెంటో తెలుసుకుందామా.

తులసిని డికాక్షన్ తయారీలో.. టీ తయారీలోనూ ఉపయోగిస్తారు. తులసి ఆకులు తింటే నోటి దుర్వాసన , నోటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే తులసి ఆకులను నేరుగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. తులసి ఆకులలో.. అలాగే.. వీటితో చేసిన నూనెలో ఎస్ట్రాగోల్ అనే రసాయనం ఉంటుంది. ఇది కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అందుకే నేరుగా తులసి ఆకులను తీసుకోవద్దు.

తులసి నూనె.. దాని సారం… శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిస్తుంది. అందుకే రక్తస్రావం సమస్య ఉన్నవారు.. తులసికి దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కూడా తులసిని అధికంగా తీసుకోవద్దు. తులసి ఎక్కువగా వేడిని కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో తులసి ఆకులను తీసుకోవద్దు. ఇందులో యూజినాల్ అనే మూలకం ఉంటుంది. తులసిలో ఉండే కొన్ని మూలకాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి. రక్తం తక్కువగా ఉన్నవారు తులసి ఆకులను తీసుకోవద్దు. మధుమేహం సమస్య ఉన్నవారు తులసిని తీసుకోవద్దు. తులసి ఆకులను తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ప్రతిసారీ తులసి తీసుకుంటే.. షుగర్ లెవల్స్ ఎక్కువగా తగ్గే పరిస్థితి ఉంటుంది.

Also Read: Kajal Aggarwal: భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ చందమామ.. కాజల్ డెసిషన్ ఏంటంటే..

Lavanya Tripathi: మహేశ్ సరసన అందాల రాక్షసి..  లక్కీ ఛాన్స్ అందుకున్న లావణ్య త్రిపాఠి ?..