Tilapia Fish Fry: తిలాపియా చేపల ఫ్రై.. ఇలా ఫ్రై చేస్తే మాటలు ఉండవు!
చేపల్లో చాలా రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అలాగే ఒక్కో చేపను ఒక్కోలా వండుతారు. కొన్ని పులుసు.. ఇంకొన్ని ఇగురు.. మరి కొన్నింటిని ఫ్రైగా చేసుకుని తింటారు. ఇలా చేపల్లో తిలాపియా కూడా ఒకటి. వీటిని ఎక్కువగా కూర కంటే.. ఫ్రై చేసుకుని తింటారు. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. స్నాక్స్ లా, స్టాటర్ లా, సైడ్ డిష్ లా ఎలా తిన్నా.. టేస్ట్ మాత్రం సూపర్బ్ అనాల్సిందే. ఈ చేపలతో ఫ్రై చేసుకోవడం కూడా చాలా..
చేపల్లో చాలా రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అలాగే ఒక్కో చేపను ఒక్కోలా వండుతారు. కొన్ని పులుసు.. ఇంకొన్ని ఇగురు.. మరి కొన్నింటిని ఫ్రైగా చేసుకుని తింటారు. ఇలా చేపల్లో తిలాపియా కూడా ఒకటి. వీటిని ఎక్కువగా కూర కంటే.. ఫ్రై చేసుకుని తింటారు. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. స్నాక్స్ లా, స్టాటర్ లా, సైడ్ డిష్ లా ఎలా తిన్నా.. టేస్ట్ మాత్రం సూపర్బ్ అనాల్సిందే. ఈ చేపలతో ఫ్రై చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరి తిలాపియా చేపల ఫ్రైన్ ను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తిలాపియా చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాల లిస్ట్:
తిలాపియా చేపలు, ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మ రసం.
తిలాపియా చేపల ఫ్రై తయారీ విధానం:
ముందుగా ఈ ఫ్రై చేసుకోవడానికి తిలాపియా చేపల తల, తోక తీసేసి.. లోపల బయట శుభ్రం చేసుకోవాలి. నీచు వాసన రాకుండా ఉండాలంటే.. కాస్త పెరుగులో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి చేపలను బాగా తోమాలి. ఇలా చేస్తే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా శుభ్రమైన చేపలను ఖాళీగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక మరో పాత్ర తీసుకుని కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మ రసం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో చేపలను కూడా వేసి.. నెమ్మదిగా మ్యారినేట్ చేయాలి. వీటిని కనీసం ఒక గంట పాటైనా పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పై కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మంటను మీడియం మంట మీద పెట్టి.. మ్యారినేట్ చేసుకున్న చేపలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే తిలాపియా చేపల ఫ్రై సిద్ధం. ఈ ఫ్రైని వీకెండ్స్ లేదా స్పెషల్ డేస్ లో తయారు చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.