Iyengar Bakery Sandwich: అయ్యంగార్ బేకరీ శాండ్ విచ్ ని ఇంట్లేనే టేస్టీగా.. హెల్దీగా చేసుకోవచ్చు!
అయ్యంగార్ బేకరీ శాండ్ విచ్ చాలా ఫేమస్. చాలా మంది ఇష్ట పడి మరీ తింటారు. పిల్లలకు అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఎన్నో శాండ్ విచ్ లు తిని ఉంటారు కానీ.. అయ్యంగార్ బేకరీ శాండ్ విచ్ కి ఉండే టేస్టే వేరే లెవల్. ఈ శాండ్ విచ్ కేవలం ఇక్కడ మాత్రమే స్పెషల్ గా దొరకుతుంది. ఈ శాండ్ విచ్ కారంగా, కాస్త తియ్యగా.. భలేగా ఉంటుంది. అంతే కాదు హెల్దీ కూడా. ఈ శాండ్ విచ్ ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బయటకు వెళ్లాల్సిన పని లేకుండా హెల్దీగా, టేస్టీగా మీ పిల్లలకు..
అయ్యంగార్ బేకరీ శాండ్ విచ్ చాలా ఫేమస్. చాలా మంది ఇష్ట పడి మరీ తింటారు. పిల్లలకు అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఎన్నో శాండ్ విచ్ లు తిని ఉంటారు కానీ.. అయ్యంగార్ బేకరీ శాండ్ విచ్ కి ఉండే టేస్టే వేరే లెవల్. ఈ శాండ్ విచ్ కేవలం ఇక్కడ మాత్రమే స్పెషల్ గా దొరకుతుంది. ఈ శాండ్ విచ్ కారంగా, కాస్త తియ్యగా.. భలేగా ఉంటుంది. అంతే కాదు హెల్దీ కూడా. ఈ శాండ్ విచ్ ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బయటకు వెళ్లాల్సిన పని లేకుండా హెల్దీగా, టేస్టీగా మీ పిల్లలకు చెప్పొచ్చు. మరి అయ్యంగార్ బేకరీ స్టైల్ శాండ్ విచ్ కు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అయ్యంగార్ బేకరీ స్టైల్ శాండ్ విచ్ కి కావాల్సిన పదార్థాలు:
ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, టమాటా, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, నిమ్మ రసం, బటర్, నూనె.
అయ్యంగార్ బేకరీ శాండ్ విచ్ తయారీ విధానం:
ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ నెక్ట్స్ టమాటా ఉండే గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. ఇవి బాగా వేగాక ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలుపు కోవాలి.
ఆ తర్వాత కొత్తిమీర తరుగు, నిమ్మ రసం కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా లోపల స్టఫ్ఫింగ్ సిద్ధం. ఇప్పుడు పెనం తీసుకుని బటర్ వేసి.. బ్రెబ్ స్లైసెస్ ఉంచి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసు కోవాలి. ఇప్పుడు బ్రెడ్ మధ్యలో స్టఫ్ఫింగ్ ఉంచి.. త్రిభుజా కారంలో కట్ చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని, టమాటా సాస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.