Tandoori Chicken: ఇంట్లోనే తందూరీ చికెన్ తయారీ.. ఈజీగా చేసుకోవచ్చు..

తందూరి చికెన్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఇష్టమైన స్టాటర్స్‌లో ఇది కూడా ఒకటి. రెస్టారెంట్లకు, హోటల్స్‌కు వెళ్లినప్పుడు ఇది కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అయితే వీటి కాస్ట కాస్త ఎక్కువే. ఎప్పూడూ బయట తినాలంటే కష్టం. కానీ ఈ తందూరి చికెన్‌ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాస్త సమయం పట్టినా ఇంట్లోనే రుచిగా, సుచిగా తయారు చేయవచ్చు..

Tandoori Chicken: ఇంట్లోనే తందూరీ చికెన్ తయారీ.. ఈజీగా చేసుకోవచ్చు..
Tandoori Chicken 1
Follow us
Chinni Enni

|

Updated on: Jan 05, 2025 | 8:56 PM

తందూరి చికెన్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఇష్టమైన స్టాటర్స్‌లో ఇది కూడా ఒకటి. రెస్టారెంట్లకు, హోటల్స్‌కు వెళ్లినప్పుడు ఇది కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అయితే వీటి కాస్ట కాస్త ఎక్కువే. ఎప్పూడూ బయట తినాలంటే కష్టం. కానీ ఈ తందూరి చికెన్‌ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాస్త సమయం పట్టినా ఇంట్లోనే రుచిగా, సుచిగా తయారు చేయవచ్చు. మరి ఈ తందూరి చికెన్‌ని ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఇది రుచి చూశాక పిల్లలు, పెద్దలు ఖచ్చితంగా హ్యాపీగా ఫీలవుతారు.

తందూరి చికెన్‌కి కావాల్సిన పదార్థాలు:

చికెన్ పెద్ద ముక్కలు, ఉల్లిపాయలు, నిమ్మరసం, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిర్చి, గరం మసాలా, ఆయిల్, ఉప్పు.

తందూరి చికెన్‌ తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని శుభ్రంగా క్లీన్ చేసి చాకుతో గాట్లు పెట్టుకోవాలి. ఉప్పులో నిమ్మరసం కలిపి ఓ అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఎక్కువ సేపు చేసుకున్నా రుచిగానే ఉంటుంది. సమయం ఉంటే కనీసం రెండు గంటలు అయినా ఫ్రిజ్‌లో పెట్టండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, గరం మసాలా వేసి అన్నీ మెత్తని పేస్టులా చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన తర్వాత ఈ మసాలా మొత్తం బాగా చికెన్‌కి పట్టేలా కోటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఓ అరగంట పక్కన పెట్టండి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత నాన్ స్టిక్ కోటింగ్ పాన్ తీసుకుని ఆయిల్ వేసి.. దానిపై చికెన్ ముక్కలను పెట్టండి. అన్ని వైపులాగా బాగా వేయించాక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే తందూరీ చికెన్ సిద్ధం. సమయం పట్టినా చివరగా తినేటప్పుడు వచ్చే ఫీల్ వేరే ఉంటుంది. వీకెండ్స్ లేదా ఏదన్నా స్పెషల్ డేస్‌లో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. మయోనీస్, టమాటా కెచప్, పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుంది.

ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు