Potato Roast: పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. ఎవ్వరైనా సరే ఇష్టంగా తింటారు..

బంగాళ దుంపలతో ఎలాంటి వంటకాలు తయారు చేసినా ఎంతో రుచిగా ఉంటాయి. ముఖ్యంగా స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌లో ఎక్కువగా బంగాళ దుంపలతో తయారు చేసిన స్నాక్స్ పెడుతూ ఉంటారు. వీటిని తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇలా బంగాళ దుంప అంటే ఇష్టం ఉండే వారికి ఇప్పుడు చెప్పే.. ఆలూ రోస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా త్వరగా, తక్కువ పదార్థాలతో..

Potato Roast: పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. ఎవ్వరైనా సరే ఇష్టంగా తింటారు..
Potato Roast
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 29, 2024 | 1:59 PM

బంగాళ దుంపలతో ఎలాంటి వంటకాలు తయారు చేసినా ఎంతో రుచిగా ఉంటాయి. ముఖ్యంగా స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌లో ఎక్కువగా బంగాళ దుంపలతో తయారు చేసిన స్నాక్స్ పెడుతూ ఉంటారు. వీటిని తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇలా బంగాళ దుంప అంటే ఇష్టం ఉండే వారికి ఇప్పుడు చెప్పే.. ఆలూ రోస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా త్వరగా, తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఆలూ రోస్ట్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో రోస్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

బంగాళ దుంపలు, బియ్యం పిండి, ఇంగువ, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు, సొంపు పొడి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి మిర్చి, ఆయిల్.

పొటాటో రోస్ట్ రెసిపీ తయారీ విధానం:

ముందుగా బంగళా దుంపలను ఒక గిన్నెలో నీళ్లు వేసి ముందుగా ఉడక బెట్టుకోవాలి. ఇవి మరీ మొత్తం ఉడక పెట్టుకోకుండా.. 80 శాతం ఉడికితే చాలు. ఇప్పుడు వీటిపై పొట్టు తీసి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆలూ ముక్కలను వేసి బియ్యం పిండిని వేసి కలపాలి. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు పొడి వేసి బాగా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో జీలకర్ర, కరివేపాకు వేసి చిటపట అన్నాక మ్యారినేట్ చేసుకున్న ఆలూ ముక్కలు వేసి.. నీళ్లు వేయకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో బాగా వేగాక ఆయిల్ పైకి తేలుతుంది. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ రోస్ట్ సిద్ధం. ఇది తింటే అచ్చం చికెన్ రోస్ట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై