- Telugu News Photo Gallery Knee pain can be reduced very easily with these Tips, Check Here is Details
Knee Pains: మోకాళ్ల నొప్పులా.. జస్ట్ ఇవి ట్రై చేస్తే మాయం అవ్వాల్సిందే!
మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు ఇప్పుడు చెప్పే ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయడం వల్ల చక్కగా తగ్గుతాయి. వయసు పెరిగిన వారు కూడా ఈ చిట్కాలు ట్రై చేయవచ్చు. అయినా తగ్గని వారు వైద్యుల చికిత్స తీసుకోవడం మంచిది.
Updated on: Oct 29, 2024 | 5:59 PM

మోకాళ్ల నొప్పులు అనేవి చాలా కామన్ విషయం. ఎక్కువు సేపు నిల్చుని పని చేసినా, మోకాళ్లపై ఎక్కువగా ప్రెజర్ పడే పనులు చేసినా మోకాళ్ల నొప్పులు వస్తాయి. అయితే కొందరిలో వయసు అయిపోయిన తర్వాత మోకాళ్ల నొప్పులు రావడం కామన్. కానీ ప్రస్తుత కాలంలో యుక్త వయసులో ఉన్నవారికి సైతం మోకాళ్ల నొప్పులు వస్తాయి.

ఈ మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి ఇప్పుడు చెప్పే ఈ హోమ్ రెమిడీస్ ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్‌కి బదులు వీటిని వాడితే చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి అవేంటో ఇప్పుడు చూడండి.

మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు పసుపు పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు.. శరీరక నొప్పుల నుంచి తక్షణమే ఫలితాన్ని ఇస్తాయి. అంతే కాకుండా ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి.

మోకాళ్ల నొప్పులు రావడానికి పోషకాహార లోపం కూడా కావచ్చు. కాబట్టి పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌లో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే వీటి నుంచి రిలీఫ్ దొరుకుతుంది.

మెంతులతో కూడా మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. మెంతుల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. మెంతులను నానబెట్టిన నీటిని తీసుకుంటూ ఉండటం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఫలితం లభిస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




