Samantha: రెండో పెళ్లి గురించి సమంత కామెంట్స్.! వీడియో వైరల్..
స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వారి వృత్తిలో బిజీ అయిపోయారు. అయితే, విడాకుల తర్వాత సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడడంతో కొంతకాలం సినిమాలకు దూరమైంది. ఈ క్రమంలో ఇటీవల చైతూ రెండో పెళ్లికి రెడీ అయ్యారు.
ఇటీవల చైతూ రెండో పెళ్లికి రెడీ అయ్యారు. శోభిత ధూళిపాళతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇక ప్రస్తుతం సమంత మళ్లీ నటనలో బిజీ అయ్యారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ త్వరలోనే విడుదల కానుంది. దాంతో ఆమె వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై కామెంట్స్ చేశారు. తాను ప్రేమించి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాననీ కానీ, ఇప్పుడు విడిపోయామనీ అందుకే జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదనీ సమంత అన్నారు. తనకు మరో వ్యక్తి అవసరం లేదనీ ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో సమంత కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ఫేమ్ రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై అంచనాలను పెంచేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.