Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న బస్సు.. 11మంది మృతి, 20మందికి సీరియస్

ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు సికార్ ఎస్పీ భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు. అలాగే 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న బస్సు.. 11మంది మృతి, 20మందికి సీరియస్
Sikar Bus Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 29, 2024 | 6:30 PM

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. సికార్‌లో మంగళవారం(అక్టోబర్ 29) మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. సికార్‌ జిల్లాలోని లక్ష్మణ్ గఢ్ ప్రాంతంలోని కల్వర్టుపై ప్రయాణికులతో నిండిన ప్రైవేట్ బస్సు అదుపు తప్పి పడిపోయింది. బస్సు వేగంతో కల్వర్టు గోడను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌ వైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కాగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ బస్సులో దాదాపు 40 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనకుస సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని క్షతగాత్రులందరినీ బస్సులో నుంచి దించి చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్‌, సికార్‌ ఆసుపత్రులకు తరలించారు. మృతుల మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏదీ ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే అందుకు గల కారణాలను పోలీసులు వారి స్థాయిలో ఆరా తీస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సికార్‌ పోలీసులు తెలిపారు. బస్సు అకస్మాత్తుగా ఊగడం ప్రారంభించిందని, కొద్దిసేపటికే బస్సు పూర్తి వేగంతో కల్వర్టు గోడను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.

బస్సులోని డ్రైవర్‌ వైపు పూర్తిగా దెబ్బతినడంతో బస్సులో కూర్చున్న ప్రయాణికులకు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న సికార్ సిటీ డీఎస్పీ (ఐపీఎస్) షాహీన్ సీ, ఏడీఎం రతన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు సికార్ ఎస్పీ భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు. అలాగే 20 మందికి పైగా గాయపడ్డారు. బస్సులో 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారని తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!