రక్తదానం పొందే వారికే కాదు.. రక్త దానం చేసే వారికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయట. రక్తదానం చేయడం వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.
రక్త దానం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా.. ఇతరుల ప్రాణం కూడా కాపాడవచ్చు.
క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా పని చేస్తుందని నిరూపించబడింది. ఎందుకంటే ఇది రక్తంలో అదనపు ఐరన్ తగ్గిస్తుంది.
రక్తదానం చేసిన తరువాత రీరం కోల్పోయిన రక్త పరిమాణాన్ని భర్తీ చేయడానికి వెంటనే పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది
రక్తదానం చేయడం ద్వారా, అదనపు ఐరన్ తగ్గించవచ్చు, ఇది గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
రక్తదానం చేయడం వల్ల 650 గ్రాముల కేలరీలు ఖర్చవుతాయి. రక్తదానం కొన్ని కేలరీలను బర్న్ చేయడానికి అదనపు మార్గం, ఇతరులకు అవసరమైనప్పుడు సహాయపడుతుంది.
రక్తదానం చేయడం ద్వారా ఒక జీవితాన్ని కాపాడిన సంతృప్తి భావన మీ మానసిక శ్రేయస్సును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.