ప్రస్తుతం యువత ఆరోగ్యం పై బాగా శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతి రోజు వ్యాయామం, యోగ తో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తినటంపై శ్రద్ద చూపిస్తున్నారు.
బ్యాలెన్స్‌డ్ డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలు, పప్పులతో పాటు డ్రైఫ్రూట్స్ కూడా ఉండాలి. వీటిలోని పోషకాలు, సమ్మేళనాలు ఆరోగ్యానికి మంచివి.
ఫిగ్స్ లేదా అంజీర్ పండ్లు లేదా అత్తి పండ్లు అని కూడా అంటారు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.. అయితే వీటిని కొంతమంది నేరుగా తింటారు.. మరి కొంతమంది డ్రైఫ్రూట్‌గా కూడా తింటుంటారు.
అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందించి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది.
అంజీర్ తినడం వల్ల ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయపడి మలబద్ధకం సమస్య ను తగ్గిస్తుంది. అంజీర్ తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. బరువు కూడా తగ్గుతారట.
అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే.. మీ ఆహారంలో అత్తి పండ్లను చేర్చుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని పోషకాలు రక్త పోటు సమస్యను తగ్గిస్తాయి.
వీటిని రోజూ రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల దీన్ని లాభాలు డబుల్ అవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.