Jani Master: ఆ ఒక్క వీడియోను చూసి జానీని తిట్టినవాళ్లే.. ఇప్పుడు పొగుడుతున్నారు.!

Jani Master: ఆ ఒక్క వీడియోను చూసి జానీని తిట్టినవాళ్లే.. ఇప్పుడు పొగుడుతున్నారు.!

Anil kumar poka

|

Updated on: Oct 29, 2024 | 10:25 AM

లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్.. బెయిల్‌ పై అక్టోబర్ 25న చంచల్ గూడ జైలు నుంచి బయటకువచ్చాడు. దీంతో నెట్టింట జానీ మాస్టర్ ను చాలామంది ద్వేషిస్తూ పోస్టులు పెడుతున్నారు. అతనికి బెయిల్ ఇవ్వాల్సింది కాదంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా.. తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నాడు జానీ మాస్టర్.

జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్ హైదరాబాద్ నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరుకు పయనమయ్యాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం, బ్రాహ్మణపల్లి సమీపానికి వచ్చే సరికి ఓ పెద్దాయన రోడ్డు మీద తీవ్రమైన గాయాలతో పడి ఉన్నాడు. ఇది చూసిన జానీ మాస్టర్.. గాయపడిన పెద్దాయనకు సాయం చేశాడు.

గాయాలతో ఉన్న ఆ పెద్దాయనను ఓదార్చి ధైర్యం చెప్పాడు. ఆ వెంటనే 108కి ఫోన్ చేశారు. 108 అంబులెన్స్ వచ్చేవరకు ఆ పెద్దాయన దగ్గరే ఉన్న జానీ మాస్టర్.. స్వయంగా ఆయన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జానీని విమర్శిస్తున్న కొంత మంది నెటిజన్లతోనే చప్పట్లు కొట్టించేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 29, 2024 10:25 AM