Potato Dosa: ఆలుగడ్డ దోశలు.. నోట్లో వేస్తే కరిగి పోతాయి..

దోశలు అంటే చాలా మందికి ఇష్టం. దోశల్లో చాలా రకాలు ఉంటాయి. ఇంట్లో కూడా చాలా రకాలుగా దోశలు వేస్తూ ఉంటారు. ఎక్కువగా చాలా మందికి ఘీ కారం దోశలు, మసాలా దోశలు అంటే ఇష్టం. కానీ మనం ఆలు గడ్డలతో కూడా దోశలు చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా, సాఫ్ట్ గా ఉంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి. చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. అందులోనూ బంగాళదుంపలు అంటే ఇష్టం ఉన్నవారు ఈ అట్లను ఖచ్చితంగా తినాల్సిందే. మరి ఆలు గడ్డలతో దోశలు..

Potato Dosa: ఆలుగడ్డ దోశలు.. నోట్లో వేస్తే కరిగి పోతాయి..
Potato Dosa
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2024 | 8:48 AM

దోశలు అంటే చాలా మందికి ఇష్టం. దోశల్లో చాలా రకాలు ఉంటాయి. ఇంట్లో కూడా చాలా రకాలుగా దోశలు వేస్తూ ఉంటారు. ఎక్కువగా చాలా మందికి ఘీ కారం దోశలు, మసాలా దోశలు అంటే ఇష్టం. కానీ మనం ఆలు గడ్డలతో కూడా దోశలు చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా, సాఫ్ట్ గా ఉంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి. చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. అందులోనూ బంగాళదుంపలు అంటే ఇష్టం ఉన్నవారు ఈ అట్లను ఖచ్చితంగా తినాల్సిందే. మరి ఆలు గడ్డలతో దోశలు ఎలా తయారు చేస్తారు? ఈ దోశలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆలు గడ్డ దోశలకు కావాల్సిన పదార్థాలు:

ఉడకబెట్టిన ఆలు, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, ఉప్మా రవ్వ, బియ్యం పిండి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, నెయ్యి లేదా ఆయిల్.

ఆలు గడ్డ దోశ తయారీ విధానం:

ముందుగా ఆలు గడ్డలను మెత్తగా ఉడికించుకోవాలి. ఉడక బెట్టి ఆలూ, కొద్దిగా వాటర్ మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇందులో బియ్యం పిండి, ఉప్మా రవ్వ, ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా.. చక్కగా మొత్తం అంతా కలిసేలా కలపాలి. పిండి చిక్కగా ఉంటే మరిన్ని వాటర్ వేయవచ్చు. అచ్చం దోశ బ్యాటర్‌లా ఉండాలి. ఆ తర్వాత ఇందులోనే ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కావాలి అనుకుంటే క్యారెట్ తురుము కూడా వేయండి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ పిండిని ఓ గంట లేదా అరగంట పాటు పక్కన పెడితే చాలు. ఆ తర్వాత పెనం వేడి చేసుకుని.. దోశలుగా పోసుకోండి. నెయ్యి లేదా ఆయిల్‌తో కాల్చుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలు దోశలు సిద్ధం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. తక్కువు సమయంలోనే తయారు చేసుకోవచ్చు.

ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దసరా స్పెషల్‌ లేజర్‌ షో
ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దసరా స్పెషల్‌ లేజర్‌ షో
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్