Peethala Iguru: పీతలతో ఇగురు ఇలా పెట్టారంటే.. తిన్నవారు మర్చిపోరు..

పీతలు అంటే చాలా మందికి ఇష్టం. సీ ఫుడ్‌లో దొరికే వాటిల్లో పీతలు కూడా ఒకటి. వీటిని ఫ్రై చేసుకున్నా, ఇగురు లేదా పులుసు పెట్టినా ఎంతో రుచిగా ఉంటుంది. పీతల కూర తినడం ఇష్టమే కానీ చాలా మందికి కర్రీ చేయడం రాదు. వేడి వేడి అన్నంలోకి పీతల కూర వేసుకుని తింటే ఆ రుచే వారు. రొయ్యలు, చేపల కంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. పీతల లోపల ఉండే ఆ మాంసం రుచే వేరు. కానీ వండటం రాక పీతలను ఎవరూ కొనడం లేదు. పీతలు తినడం కూడా ఆరోగ్యానికి..

Peethala Iguru: పీతలతో ఇగురు ఇలా పెట్టారంటే.. తిన్నవారు మర్చిపోరు..
Peethala Iguru
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 03, 2024 | 9:51 PM

పీతలు అంటే చాలా మందికి ఇష్టం. సీ ఫుడ్‌లో దొరికే వాటిల్లో పీతలు కూడా ఒకటి. వీటిని ఫ్రై చేసుకున్నా, ఇగురు లేదా పులుసు పెట్టినా ఎంతో రుచిగా ఉంటుంది. పీతల కూర తినడం ఇష్టమే కానీ చాలా మందికి కర్రీ చేయడం రాదు. వేడి వేడి అన్నంలోకి పీతల కూర వేసుకుని తింటే ఆ రుచే వారు. రొయ్యలు, చేపల కంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. పీతల లోపల ఉండే ఆ మాంసం రుచే వేరు. కానీ వండటం రాక పీతలను ఎవరూ కొనడం లేదు. పీతలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మీ కోసమే పీతలను ఎలా వండితే రుచిగా ఉంటుందో రెసిపీ తీసుకొచ్చాం. మరి ఇంకెందుకు లేట్ పీతల ఇగురు ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పీతల ఇగురుకు కావాల్సిన పదార్థాలు:

పీతలు, ఉల్లిపాయ, టమాటాలు, పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ ఆకులు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు.

పీతల ఇగురు తయారీ విధానం:

పీతల నుంచి నీచు వాసన అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి పసుపు, ఉప్పు, పెరుగు వేసి శుభ్రంగా పీతలను కడగాలి. ఆ నెక్ట్స్ అల్లం, వెల్లుల్లి, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వుని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కర్రీ పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడెక్కాక.. ఇందులో బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగాక ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించు కోవాలి. ఇవి వేగాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పీతలను కూడా వేసి వేయించాలి. ఇవి వేగుతున్నప్పుడే టమాటా ముక్కలు, మిక్సీ పట్టిన పేస్టును వేసి ఓ పది నిమిషాలు చిన్న మంట మీద వేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇవన్నీ వేగాక రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి మళ్లీ అంతా ఒకసారి కలుపుకుని ఓ రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వేసి బాగా ఉడకనివ్వాలి. దించే ముందు కారానికి తగినట్టుగా గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు చల్లి ఓ ఉడుకు ఉడకనిచ్చి దించేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పీతల ఇగురు సిద్ధం.

దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు