Chicken Pickle: సింపుల్‌గా టేస్టీ చికెన్ పచ్చడిని ఇలా చేయండి.. అదిరిపోతుంది!

నిల్వ పచ్చళ్లు అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ చికెన్ నిల్వ పచ్చడి అంటే.. నాన్ వెజ్ ప్రియులకు నోరు ఊరుతుంది. ఆవకాయ పచ్చడిని ఎలా అయితే ప్రాంతాల బట్టి పెడతారో.. చికెన్ నిల్వ పచ్చడిని కూడా అలాగే ప్రాంతాల బట్టి పెడుతూ ఉంటారు. ఈ చికెన్ కర్రీ చేసినంత సమయం కూడా పట్టదు నిల్వ పచ్చడి చేయాలంటే. బ్యాచిలర్స్‌కు అయితే ప్రాణం అని చెప్పొచ్చు. బ్యాచిలర్స్ కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఐటెమ్స్ పడతాయి. మరి ఈ చికెన్ నిల్వ పచ్చడిని..

Chicken Pickle: సింపుల్‌గా టేస్టీ చికెన్ పచ్చడిని ఇలా చేయండి.. అదిరిపోతుంది!
Chicken Pickle
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 23, 2024 | 10:15 PM

నిల్వ పచ్చళ్లు అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ చికెన్ నిల్వ పచ్చడి అంటే.. నాన్ వెజ్ ప్రియులకు నోరు ఊరుతుంది. ఆవకాయ పచ్చడిని ఎలా అయితే ప్రాంతాల బట్టి పెడతారో.. చికెన్ నిల్వ పచ్చడిని కూడా అలాగే ప్రాంతాల బట్టి పెడుతూ ఉంటారు. ఈ చికెన్ కర్రీ చేసినంత సమయం కూడా పట్టదు నిల్వ పచ్చడి చేయాలంటే. బ్యాచిలర్స్‌కు అయితే ప్రాణం అని చెప్పొచ్చు. బ్యాచిలర్స్ కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఐటెమ్స్ పడతాయి. మరి ఈ చికెన్ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

చికెన్, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, గరం మసాలా, ధనియాల పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పాయలు, నిమ్మ కాయ.

చికెన్ నిల్వ పచ్చడి తయారీ విధానం:

ముందుగా అల్లం, వెల్లుల్లిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి.. మిక్సీలో వేయాలి. ఇది పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని.. మసాలా దినుసులు అన్నింటినీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ రసం కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్‌లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. పెద్ద పాన్ పెట్టుకుని చికెన్ వేసుకుని వాటర్ అంతా పోయేంత వరకూ ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయాక అందులోనే ఆయిల్ వేసి చికెన్ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక లోతైన పాత్రలోకి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఆ ఆయిల్‌లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. నెక్ట్స్ దీన్ని కూడా చికెన్‌లో వేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌లో సాల్ట్, పసుపు, కారం, ముందుగా చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి, చివ్లో కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా నిమ్మ రసం కూడా పిండుకుని.. ఓ మూడు రోజుల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు ముక్క అనేది బాగా ఊరుతుంది. అంతే ఎంతో టేస్టీ నిల్వ పచ్చడి రెడీ. ఇంకెందుకు లేట్.. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.