Arikela Kichidi: హెల్దీ బ్రేక్ ఫాస్ట్ అరికెల కిచిడీ.. రుచితో పాటు ఆరోగ్యం!
ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. లైఫ్ స్టైల్ విధానం మారడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. సరైన పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడొచ్చు. అలా మీకు ఆరోగ్యాన్ని పెంచడంలో అరికెలు కూడా సహాయ పడతాయి. అరికెలు తీసుకోవడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. ఇవి వెయిట్ లాస్‌ను..

ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. లైఫ్ స్టైల్ విధానం మారడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. సరైన పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడొచ్చు. అలా మీకు ఆరోగ్యాన్ని పెంచడంలో అరికెలు కూడా సహాయ పడతాయి. అరికెలు తీసుకోవడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. ఇవి వెయిట్ లాస్‌ను కూడా చేస్తాయి. షుగర్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. అరికెలతో తయారు చేసుకునేవాటితో కిచిడీ కూడా ఒకటి. ఈ అరికెల కిచిడీ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మరి ఈ అరికెల కిచిడీని ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అరికెల కిచిడీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
అరికెలు, పెసర పప్పు, ఉల్లిపాయ, టమాటా, పచ్చి మిర్చి, అల్లం తరుగు, పచ్చి బఠానీ, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, కారం, ఉప్పు, పసుపు, నెయ్యి.
అరికెల కిచిడీ తయారీ విధానం:
అరికెలు, పెసర పప్పు రెండూ ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటిలో కొద్దిగా వాటర్ వేసి ఓ గంటసేపు అయినా నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ, టమాటా, పచ్చి మిర్చి, అల్లం తరుగు, పచ్చి బఠానీ, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా నెయ్యి వేసి అన్నీ కలిపి కుక్కర్‌లో వేసి ఓ మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించండి. వేడి చల్లారాక విజిల్ తీసేసి.. పప్పుగుత్తితో మెదుపుకోవాలి. తర్వాత నెయ్యితో పోపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే అరికెల కిచిడీ సిద్ధం. దీన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా తీసుకోవచ్చు.




