Panasa Dosa: పనస పండు దోశ.. రుచి చూశారంటే అస్సలు వదిలిపెట్టరు!
ఆహారంలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. అయితే ఏది ఆరోగ్యం? ఏది అనారోగ్యం చేస్తుందో తెలుసుకుని తినడం చాలా మంచిది. కానీ ఇప్పుడున్న యువత, పిల్లలు ఏది పడితే అవి తింటూ.. అనారోగ్య సమస్యల్ని కొని మరీ తెచ్చుకుంటున్నారు. అనుకోకుండా సమస్యల బారిలో పడి.. కొట్టుమిట్టాడుతున్నారు. దోశల్లో ఇప్పుడు అనేక రకాలు వచ్చాయి. వాటిల్లో ఇప్పటికే ఎన్నో రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మీ ముందుకు పనస దోశతో..

ఆహారంలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. అయితే ఏది ఆరోగ్యం? ఏది అనారోగ్యం చేస్తుందో తెలుసుకుని తినడం చాలా మంచిది. కానీ ఇప్పుడున్న యువత, పిల్లలు ఏది పడితే అవి తింటూ.. అనారోగ్య సమస్యల్ని కొని మరీ తెచ్చుకుంటున్నారు. అనుకోకుండా సమస్యల బారిలో పడి.. కొట్టుమిట్టాడుతున్నారు. దోశల్లో ఇప్పుడు అనేక రకాలు వచ్చాయి. వాటిల్లో ఇప్పటికే ఎన్నో రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మీ ముందుకు పనస దోశతో వచ్చాం. ఈ దోశ రుచితో పాటు ఆరోగ్యం కూడా. ఒక్కసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ ఇంకొకటి అంటూ తినేస్తారు. మరి ఈ పనస పండు దోశను ఎలా చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పనస పండు దోశకు కావాల్సిన పదార్థాలు:
పనస పండు గుజ్జు, బియ్యం, మినపప్పు, ఆయిల్, ఉప్పు.
పనస పండు దోశ తయారీ విధానం:
ముందుగా దోశ పిండికి పప్పును ఎలా నానబెడతారో అలాగే నానబెట్టాలి. మీరు ఎప్పుడూ తీసుకునే క్వాంటిటీనే తీసుకోండి. అయితే వాటితో పాటు పనస పండు గుజ్జును కూడా వేసి కలిపి.. బాగా మిక్సీ పట్టుకోండి. అయితే రాత్రంగా బయట వదిలేయకుండా.. ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోండి. ఉదయం కొద్దిగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. వేడి చేసుకోవాలి. పాన్ వేడెక్కాక అట్టును వేసుకోండి. రెండు వైపులా ఆయిల్ వేసి.. ఎర్రగా వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పనస దోశ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎప్పుడూ ఒకేలాంటివే కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి.








