Bottle Gourd: బరువునీ అదుపులో ఉంచే సొరకాయ! వారంపాటు ఇలా తీసుకుంటే కుండలాంటి మీ పొట్ట నాజూకైపోతుంది
ఆరోగ్యకరమైన ఆహారాలలో కూరగాయలు ముఖ్యమైనవి. అన్ని రకాల కూరగాయలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయలలో సొరకాయ ఒకటి. ఇది శరీరానికి అవసరమైన వివిధ ఖనిజాలు, విటమిన్లను అందిస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. సారకాయ తేలిగ్గా అరగడమే కాకుండా, శరీర తాపాన్ని తగ్గించడంలో..

ఆరోగ్యకరమైన ఆహారాలలో కూరగాయలు ముఖ్యమైనవి. అన్ని రకాల కూరగాయలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయలలో సొరకాయ ఒకటి. ఇది శరీరానికి అవసరమైన వివిధ ఖనిజాలు, విటమిన్లను అందిస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. సారకాయ తేలిగ్గా అరగడమే కాకుండా, శరీర తాపాన్ని తగ్గించడంలో దీనికి మించినది మరొకటి లేదు.
సొరకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వంద గ్రాముల సొరకాయ నుంచి శరీరానికి కేవలం 15 క్యాలరీలు మాత్రమే అందుతాయి. నీరు మాత్రం96 శాతం ఉంటుంది. ఇందులో జీర్ణశక్తికి మేలు చేసే పీచు పదార్ధం పుష్కలంగా దొరుకుతుంది. అతిగా తినే అలవాటుని కూడా ఇది తగ్గిస్తుంది. శరీర బరువుని అదుపులో ఉంచుతుంది. నీరు చెమట రూపంలో బయటకు పోతే, నీటి నిల్వలు తగ్గి నిస్సత్తువ అనిపిస్తుంటుంది. ఈ పరిస్థితి తలెత్తకూడదంటే సొరకాయని తరచూ తింటేసరి. అలాగే అతి దాహం తగ్గిస్తుంది. ఇందులో శరీరానికి హాని చేసే కొవ్వు ఉండదు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
పొట్లకాయను మార్కెట్‌లో కొన్న తర్వాత ముక్కలుగా కోయాలి. గోరింటాకు 2 కప్పులు, 2 చెంచాల మిరియాలు, అరకప్పు కొత్తిమీర తరుగు, 1 చెంచా జీలకర్ర, అరకప్పు నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి తీసుకుని నిమ్మరసం మినహా మిగిలిన పదార్థాలను కలుపుకోవాలి. ఒక కప్పు నీరు అందులో పోసి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని స్ట్రైనర్ ద్వారా వడకట్టి రసం తీసుకోవాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా ఒక వారం పాటు తీసుకుంటే మార్పును మీరే గమనించవచ్చు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.








