AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI in Recruitment: ఇక ఉద్యోగుల ఎంపికలోనూ ఏఐ టెక్నాలజీ..! మనుషులతో పనిలేకుండా చకచకా నియామకాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఎన్నో ఉద్యోగాలు రిస్క్‌లో పడ్డాయి. చాలా కంపెనీలు ఏఐ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నాయి. ఇప్పటి వరకూ దీనిని ఉద్యోగులు నిర్వహించే సేవల కోసం వినియోగించారు. ఇకపై దీనిని ఉద్యోగాల ఎంపిక కోసం కూడా వినియోగించనున్నారు. సాధారణంగా ఏదైనా సంస్థలో ఉద్యోగం కావాలంటే రెస్యూమ్స్ తీసుకెళ్లాం. వీటిని ఆ కంపెనీ రిక్రూట్‌మెంట్ బోర్డు పరిశీలించి, అర్హత ఉన్నవారిని..

AI in Recruitment: ఇక ఉద్యోగుల ఎంపికలోనూ ఏఐ టెక్నాలజీ..! మనుషులతో పనిలేకుండా చకచకా నియామకాలు
AI in recruitment process
Srilakshmi C
|

Updated on: May 31, 2024 | 7:52 PM

Share

న్యూఢిల్లీ, మే 31: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఎన్నో ఉద్యోగాలు రిస్క్‌లో పడ్డాయి. చాలా కంపెనీలు ఏఐ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నాయి. ఇప్పటి వరకూ దీనిని ఉద్యోగులు నిర్వహించే సేవల కోసం వినియోగించారు. ఇకపై దీనిని ఉద్యోగాల ఎంపిక కోసం కూడా వినియోగించనున్నారు. సాధారణంగా ఏదైనా సంస్థలో ఉద్యోగం కావాలంటే రెస్యూమ్స్ తీసుకెళ్లాం. వీటిని ఆ కంపెనీ రిక్రూట్‌మెంట్ బోర్డు పరిశీలించి, అర్హత ఉన్నవారిని ఇంటర్వ్యూలకు పిలిచి సామర్ధ్యాలున్నవారిని ఎంపిక చేస్తారు. ఇది అసలైన ప్రక్రియ. కానీ ఏఐ వాడకంలోకి వచ్చిన తరువాత ఇంటర్వ్యూల విషయంలో కూడా టెక్నాలజీని వాడేస్తున్నారు.

అభ్యర్థుల సోర్సింగ్, రెజ్యూమ్ స్క్రీనింగ్, స్కిల్స్ అసెస్‌మెంట్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి కృత్రిమ మేధస్సు సాధనాలను (AI Tools)ను రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో మనుషులకు బదులు వినియోగిస్తున్నారు. GenAI బాట్‌లు మేనేజర్‌లకు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో సహాయపడుతున్నాయి. నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి, మరింత సమర్ధవంతంగా ఉద్యోగాల నియామకాలు జరపడానికి ఉపయోగపడతాయని హెచ్‌ అధికారులు చెబుతున్నారు. వృత్తిపరమైన సేవల సంస్థ Genpact ఇటీవల IMatch, GenAI-ఆధారిత అంతర్గత రెజ్యూమ్ పార్సింగ్, జాబ్-మ్యాచింగ్ ఇంజిన్‌ను ప్రారంభించింది. కొత్త నియామకాలలో దాదాపు 40 శాతం అభ్యర్థులను ఏఐ ద్వారా ఎంచుకున్నట్లు, ఇంటర్వ్యూలు చాలా వేగంగా జరుగుతున్నాయని జెన్‌ఫ్యాక్ట్‌ గ్లోబల్ హైరింగ్ లీడర్ రీతు భాటియా పేర్కొన్నారు. నియామకాలు చేపట్టడానికి 63 రోజులు పట్టేది, అయితే ఏఐ సాయం వల్ల ఇది 43 రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగిసినట్లు భాటియా పేర్కొన్నారు.

రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ పీపుల్‌ఫై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ‘రాజేష్ భారతీయ’ ప్రకారం.. జెన్ఏఐ ఉద్యోగులను ఇంటర్వ్యూలు చేసే సమయాన్ని ఆదా చేస్తుంది. GenAI బాట్‌ వినియోగించడం వల్ల మా నిమాయక సామర్ధ్యాలు మెరుగుపడ్డాయి. ఇంటర్వ్యూ కోసం GenAI బాట్‌ని ఉపయోగించడానికి ముందు కేవలం 15 శాతం ఉన్న నియామకాలు ఇప్పుడు 55 శాతం పెరిగాయి. రాత్రికి రాత్రే ఎంపిక రేట 40 శాతం పెరిగింది. జెన్‌ఏఐ ద్వారా నియామకాలు వేగంగా చేపట్టవచ్చు. అయితే ఇలా నియామకాల్లో ఏఐని అమలు చేయడంలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీటిలో డేటా గోప్యత, అల్గారిథమిక్ పారదర్శకత, సాఫ్ట్ స్కిల్స్ మూల్యాంకనం లేకపోవడం, సంభావ్యతను కనుగొనడంలో అసమర్థత వంటి నైతిక పరిశీలనలు ఏఐలో ఉండవు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.