Summer Fruits: చిన్నగా ఉన్నాయని తేలిగ్గా చూడకండి.. పెద్దపెద్ద రోగాలు తరిమేసే అద్భుత ఫలాలివి!
ఫాల్స అనే చిన్న సైజు పండ్లు సాధారణంగా మార్కెట్‌లో ఎక్కువగా కనిపించవు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండ్ల చెట్లు అధికంగా కనిపిస్తాయి. పోషకాలు పుష్కలంగా ఉండే ఫాల్సా ఒక రకమైన బెర్రీ పండు. రోజువారీ ఆహారంలో ఫాల్సా పండ్లు తీసుకుంటే మందులు తీసుకోవలసిన అవసరం లేదు. ఇవి రుచికి పుల్లగా ఉంటాయి. ఫాల్సా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా కనిపిస్తుంది...

Phalsa Fruits
ఫాల్స అనే చిన్న సైజు పండ్లు సాధారణంగా మార్కెట్‌లో ఎక్కువగా కనిపించవు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండ్ల చెట్లు అధికంగా కనిపిస్తాయి. పోషకాలు పుష్కలంగా ఉండే ఫాల్సా ఒక రకమైన బెర్రీ పండు. రోజువారీ ఆహారంలో ఫాల్సా పండ్లు తీసుకుంటే మందులు తీసుకోవలసిన అవసరం లేదు. ఇవి రుచికి పుల్లగా ఉంటాయి. ఫాల్సా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా కనిపిస్తుంది. పండితే ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. సాధారణంగా మే-జూన్ నెలలో ఫాల్సా పండ్లు కాస్తాయి. ఈ వేసవి పండు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
- ఫాల్సా తింటే అలసట ఇట్టే దూరం అవుతుంది. వేసవిలో అధిక వేడి కారణంగా సంభవించే బలహీనతను తొలగించడానికి ఇవి సహాయపడతాయి. 1000 గ్రాముల ఫాల్సా పండ్లలో 724 కేలరీల శక్తి లభిస్తుంది. వేసవిలో శరీరం బలహీనంగా మారితే, ఫల్సా జ్యూస్
- తీసుకోవచ్చు. ఫలితంగా వేసవిలో పని చేయడానికి తగినంత శక్తిని పొందవచ్చు. ఫాల్సాలో నీటి పరిమాణం అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ నుంచి ఉపశనం కలిగిస్తుంది. అలాగే వేసవిలో శరీరంలో నీటి కొరతను తొలగించడానికి ఫాల్సా జ్యూస్ తాగవచ్చు.
- ఎండాకాలంలో బయటి ఆహారం తొంటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఫాల్సా డయేరియా నుంచి కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఫాల్సాలోని వివిధ పదార్థాలు కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
- ఫాల్సాలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఈ పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫాల్సాలోని యాంటీఆక్సిడెంట్ టానిన్‌లు ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించి లిపిడ్ ప్రొఫైల్‌ను సమతుల్యం చేస్తాయి.
- హైపర్‌టెన్సివ్ రోగులు వేసవిలో తప్పనిసరిగా ఫాల్సా తినాలి. ఈ పండులోని పొటాషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. తద్వారా ఇది గుండెపోటు అవకాశాలను తగ్గిస్తుంది.
- ఫాల్సాలో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఫాల్సా సహాయపడుతుంది. ఈ చిన్న పండులో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం అధికంగా ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.




