Sankranti Special Sweet: ఈ పండక్కి కొబ్బరితో పాకుండలు చేయండి.. అదుర్స్ అంతే!
సంక్రాంతి వచ్చిందంటే ఇంట్లో ఖచ్చితంగా పిండి వంటలు ఉండాల్సిందే. ఈ పండక్కి అందరి ఇళ్లలో కూడా ఘుమఘుమలాడే సువాసనలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అరిసెలు, పాకుండలు, జంతికలు, సున్నిండలు అంటూ అనేక రకాల పిండి వంటలు చేస్తారు. వీటిల్లో ఎక్కువగా కొబ్బరితో చేసే పాకుండలు అంటే చాలా మంది ఇష్ట పడుతూ తింటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి..
సంక్రాంతి వచ్చిందంటే ఇంట్లో ఖచ్చితంగా పిండి వంటలు ఉండాల్సిందే. ఈ పండక్కి అందరి ఇళ్లలో కూడా ఘుమఘుమలాడే సువాసనలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అరిసెలు, పాకుండలు, జంతికలు, సున్నిండలు అంటూ అనేక రకాల పిండి వంటలు చేస్తారు. వీటిల్లో ఎక్కువగా కొబ్బరితో చేసే పాకుండలు అంటే చాలా మంది ఇష్ట పడుతూ తింటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు మరింత ఇష్ట పడి తింటారు. అయితే అందరికీ ఈ రెసిపీ చేయడం రాదు. ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ కొబ్బరి పాకుండలు ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొబ్బరి పాకుండలకు కావాల్సిన పదార్థాలు:
కొబ్బరి, బెల్లం, బియ్యం పిండి, యాలకుల పొడి, నువ్వులు, ఆయిల్, నెయ్యి.
కొబ్బరి పాకుండలు తయారీ విధానం:
కొబ్బరి పాకుండలు తయారీకి ముందుగా పాకం తీసుకోవాలి. ఇందుకు బియ్యాన్ని రాత్రి పూట కడిగేసి నీటిలో నానబెట్టాలి. ఉదయం లేచాక బియ్యాన్ని వడకట్టి మీక్సీలో వేసి పొడి చేసుకోవచ్చు. పిండి మాత్రం తడిగానే ఉండాలి. ఈ పిండి ఆరిపోకుండా చూసుకోండి. కాబట్టి పైన తడి క్లాత్ వేయండి. ఈలోపు స్టవ్ మీద బెల్లం, కొద్దిగా పంచదార, యాలకుల పొడి, నీళ్లు కొద్దిగా వేసి పాకం తీయాలి. ఈ పాకం పడుతున్నప్పుడే కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. దీంతో పాకుండలు మరింత రుచిగా ఉంటాయి.
ఈ పాకం పడుతున్నప్పుడే తడిగా ఉండే బియ్యం పిండిని వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండలు లేకుండా చేయాలి. ఈలోపు కొబ్బరిని తురిమి.. నెయ్యిలో బాగా వేయించి పాకంలో వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు కూడా వేసి కలపండి. ఈలోపు ఆయిల్ వేడి చేసి హీట్ చేయాలి. ఆయిల్ వేడెక్కగానే.. చిన్న ఉండలు చేసి పాకుండలు వేయండి. మీడియం మంట మీద అన్నీ వేగగానే తీసి పక్కన పెట్టుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాకుండలు సిద్ధం.