ఫ్రిజ్‌లో కూరగాయలు పెడుతున్నారా ?

ఫ్రిజ్ లో నిల్వ చేసే కొన్ని కూరగాయలు, ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకుకూరలను 12 గంటల పాటు మాత్రమే ఫ్రిజ్ లో ఉంచడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పోషకాలు తగ్గిపోతాయి. అల్లాన్ని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల బూజు రావడం, చెడిపోవడం జరుగుతుంది. అందుకే పొడి రూపంలో నిల్వ చేయడం మంచిది. టమోటాలు ఫ్రిజ్ లో ఉంచితే వాటి రుచి, పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి సరైన పద్ధతిలో నిల్వ చేయడం ఆరోగ్యానికి మంచిది.

ఫ్రిజ్‌లో కూరగాయలు పెడుతున్నారా ?
Vegetables Storage In Fridge
Follow us
Prashanthi V

|

Updated on: Jan 13, 2025 | 6:19 PM

మనం ఫ్రిజ్ లో ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఉపయోగిస్తాం. చలికాలం, ఎండకాలం అని తేడా లేకుండా ఇంటి అవసరాలకు ఫ్రిజ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి తన సహజ గుణాలు కోల్పోయి, ఆరోగ్యానికి హాని చేస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఫ్రిజ్ ఉన్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిజ్ లో ఆకుకూరల నిల్వ

చలికాలంలో ఆకుకూరలు అధికంగా లభిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే, ఆకుకూరలను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేస్తే వాటి రుచి, పోషకాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఆకుకూరలను శుభ్రంగా కడిగి, 12 గంటల వరకు ఫ్రిజ్‌లో ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల వాటి సహజమైన లక్షణాలు నశించకుండా ఉంటాయి. ఎక్కువ సమయం నిల్వ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

సరైన పద్ధతిలో అల్లం నిల్వ

ప్రతి ఇంట్లో అల్లం చాలా సాధారణంగా కనిపిస్తుంది. దీన్ని సహజ ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. కొంతమంది అల్లాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. కానీ దీని వల్ల త్వరగా బూజు రావడం, చెడిపోవడం జరుగుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన అల్లం తినడం మూత్రపిండాలకు, కాలేయానికి హానికరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్లాన్ని పొడి లేదా పేస్ట్ రూపంలో సన్నగా కట్ చేసి నిల్వ చేస్తే ఎక్కువ రోజుల వరకు ఉపయోగించవచ్చు.

ఫ్రిజ్‌లో బంగాళాదుంపలు ?

బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి మొలకెత్తుతాయి. అలాగే, వాటిలోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది, ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదకరంగా మారుతుంది. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బంగాళాదుంపలను చల్లని, పొడి ప్రదేశంలో భద్రపరచడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల వాటి పోషక గుణాలు అలాగే ఉంటాయి.

టమోటాల నిల్వపై ప్రభావం

టమోటాలు ప్రతి ఇంట్లో అవసరమైనవే. చాలా మంది ఇవి కుళ్లిపోకుండా ఫ్రిజ్‌లో భద్రపరుస్తారు. కానీ ఫ్రిజ్‌లో ఉంచిన టమోటాలు రుచిని, ఆకృతిని కోల్పోతాయి. టమోటాలలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రిజ్‌లో నిల్వ చేసినప్పుడు ప్రభావం కోల్పోతాయి. టమోటాలను గాలి చొరబడని సంచిలో ఉంచి చల్లని ప్రదేశంలో ఉంచడం మంచిది. ఈ పద్ధతితో వాటి పౌష్టికత అలాగే నిలవడం మాత్రమే కాకుండా, రుచి కూడా మారదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదు.