Andhra News: పందెం కొట్టు థార్ కారు పట్టు.. కోడిపందాల్లో ఈ బరి చాలా కాస్ట్లీ గురూ..
ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసుల ఆంక్షలను లైట్ తీసుకున్న నిర్వాహకులు గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో కోడిపందాలను నిర్వహిస్తున్నారు. గుండాట, జూదం కూడా కోడిపందాల బరుల దగ్గరే నిర్వహిస్తున్నారు. మినీ స్టేడియాలను తలపించేలా కోడి పందాల బరులను సిద్ధం చేశారు నిర్వాహకులు.
ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసుల ఆంక్షలను లైట్ తీసుకున్న నిర్వాహకులు గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో కోడిపందాలను నిర్వహిస్తున్నారు. గుండాట, జూదం కూడా కోడిపందాల బరుల దగ్గరే నిర్వహిస్తున్నారు. మినీ స్టేడియాలను తలపించేలా కోడి పందాల బరులను సిద్ధం చేశారు నిర్వాహకులు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, కృష్ణాజిల్లాల్లో చాలాచోట్ల కోడిపందాలను ప్రారంభించారు. భారీ స్క్రీన్లు, ఎల్‌ఈడీ వెలుగుల్లో కోడిపందాలను నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకటించి మరీ కోడిపందాలు నిర్వహిస్తోన్నారు. దెందులూరులో KPL అంటే కోడిపందాల ప్రీమిర్ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. కాళ్లకు కత్తులతో పందెం కోళ్లు తలపడుతున్నాయి. పందాల్లో పాల్గొనేందుకు ఏపీ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా పందెంరాయుళ్లు ఏపీకి చేరుకున్నారు.
కాగా.. కాకినాడ రూరల్ పెనుగుదురులో కోడిపందాల విజేతలకు రూ.25 లక్షల విలువ గల మహేంద్ర థార్ జీప్ బహుమతిని అందజేయనున్నారు.. జిల్లాలోనే అతిపెద్ద బరిగా పెనుగుదురు నిలిచింది.. నిర్వాహకులు ప్రకటించిన బహుమతితో ఇక్కడ పందెం పోటీలలో పాల్గొనడానికి పందెం రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు.. పండుగ మూడు రోజులు పాటు 63 జతల జోడు పందేలు ఉంటాయని అందులో మెజారిటీ పందేలు గెలిచిన వారికి జీప్ గిఫ్ట్ గా ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.. ఈ ఆఫర్‌తో ఈ బరిపై క్రేజ్ పెరుగుతోంది.. ఒక్క బరిలోనే దాదాపు రూ.5 కోట్లకు పైగానే పందేలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..