గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇవి పాటిస్తే ఈజీగా చెక్​ పెట్టొచ్చు!

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలు తగ్గించడానికి సహజ చిట్కాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. హెర్బల్ టీలు, మెంతులు, పుదీనా ఆకులు, వంటి సహజ పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరిచే, గ్యాస్, అజీర్తి, కడుపు నొప్పి, ఉబ్బరాన్ని తగ్గించే గొప్ప పరిష్కారాలు. ఈ పద్ధతులు కడుపు సమస్యలకు సహజ పరిష్కారం కలిగిస్తాయి. అలాగే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం కూడా మంచిది.

గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇవి పాటిస్తే ఈజీగా చెక్​ పెట్టొచ్చు!
Remedies For Gas Relief
Follow us
Prashanthi V

|

Updated on: Jan 13, 2025 | 7:17 PM

మనలో చాలా మంది ఆలోచించకుండా ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, శనిగపిండితో చేసిన స్నాక్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటాం. అలాగే కొన్ని సార్లు బయట భోజనం చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఆహార అలవాట్ల వల్ల అజీర్తి, గ్యాస్, లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. కడుపు నొప్పి, గుండెల్లో మంట వంటి లక్షణాలు మనం చూస్తుంటాం. కానీ కొన్ని సహజ చిట్కాలతో ఈ సమస్యలను ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలకు పుదీనా బెస్ట్ ఆప్షన్

పుదీనా ఆకులు జీర్ణక్రియకు ఎంతో మంచి ప్రయోజనం కలిగిస్తాయి. పుదీనా ఆకులలోని ఔషధ గుణాలు కడుపు సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యల నివారణకు పుదీనా చక్కటి పరిష్కారం. ఉదయం పూట ఒక్క పుదీనా ఆకులు నమిలితే అవి తక్షణ ఉపశమనం ఇస్తాయి. పుదీనా టీ కూడా చాలా ఉపయోగకరమైనది. ఇది కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గించేందుకు మంచి సహాయాన్ని ఇస్తుంది. ఇది కడుపు సమస్యలకు ఆప్షనల్‌గా తీసుకోవచ్చు.

హెర్బల్ టీలు

గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి హెర్బల్ టీలు ఒక మంచి పరిష్కారం అంటున్నారు. ఈ టీలు జీర్ణక్రియను మెరుగుపరచటంలో సహాయపడతాయి. పైగా కడుపు లోపాలను నివారించేందుకు మేలు చేస్తాయి. ఉదాహరణకి, మెంతులు, అల్లం, పుదీనా ఆకులు, తులసి వంటివి, పండ్లు, కషాయాలు గ్యాస్ సమస్యలకు మంచి మందులట. ఈ హెర్బల్ టీలు జీర్ణవ్యవస్థను దృఢపరచి, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఈ టీలు రెగ్యులర్‌గా తీసుకుంటే, జీర్ణ సమస్యలకు నిలకడైన పరిష్కారం లభిస్తుందంటున్నారు నిపుణులు.

మెంతులతో గ్యాస్ సమస్యలకు చెక్

మెంతులు ఎప్పుడూ మన ఆహారంలో ఉండే ఒక ముఖ్యమైన భాగం. ఇవి కేవలం రుచిని మాత్రమే ఇవ్వవు, అవి జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తాయి. మెంతులు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండినవి, వీటివల్ల కడుపు నొప్పులు, ఉబ్బరం, అజీర్తి లాంటి సమస్యలు తగ్గిపోతాయి. మెంతులు జీర్ణక్రియను సమర్థవంతంగా పని చేసేందుకు సహాయపడతాయి. కొన్ని అధ్యయనాలు మెంతులు జీర్ణ వ్యవస్థ రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని సూచిస్తున్నాయి. మీరు మెంతుల్ని వంటల్లో ఉపయోగించవచ్చు లేదా నీటిలో ఉడికించి ఆ నీటిని తాగినా ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

మనం క్రమం తప్పకుండా ఎదురయ్యే ఆహారపు అలవాట్ల వల్లే అజీర్తి, గ్యాస్, లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతో మనం ఏం తినాలి, ఎప్పుడు తినాలి అనే విషయంలో క్లారిటీ ఉండదు. పైన చెప్పిన విధంగా పాటించడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిష్కారాలు సహజమైనవి కావడంతో, అవి వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే, ఏ విధమైన పరిష్కారానికైన ముందుగా సంబంధిత నిపుణులతో సంప్రదించడం మంచిది.