Nuvvla Ladu: నువ్వుల లడ్డూ ఇలా చేశారంటే నోట్లో వేయగానే కరిగిపోతుంది..
నువ్వుల లడ్డూ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు వీటిని ఎక్కువగా తినేవారు. కానీ ఇప్పుడు పెద్దగా ఎవరూ తినడం లేదు. నువ్వుల లడ్డూ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వుల లడ్డూ తినడం వల్ల బలంగా, దృఢంగా ఉంటారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారి చేత రోజుకు ఒకటి తినిపిస్తూ ఉండాలి. వీటిని తింటే పిల్లల ఎదుగుదల ఎంతో బాగుంటుంది. త్వరగా ఎలాంటి జబ్బులు ఎటాక్ కాకుండా..
నువ్వుల లడ్డూ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు వీటిని ఎక్కువగా తినేవారు. కానీ ఇప్పుడు పెద్దగా ఎవరూ తినడం లేదు. నువ్వుల లడ్డూ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వుల లడ్డూ తినడం వల్ల బలంగా, దృఢంగా ఉంటారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారి చేత రోజుకు ఒకటి తినిపిస్తూ ఉండాలి. వీటిని తింటే పిల్లల ఎదుగుదల ఎంతో బాగుంటుంది. త్వరగా ఎలాంటి జబ్బులు ఎటాక్ కాకుండా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మరి ఇంత ఆరోగ్యకరమైన నువ్వుల లడ్డు ఎలా తయారు చేస్తారు? ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
నువ్వుల లడ్డూకి కావాల్సిన పదార్థాలు:
బెల్లం, నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి. వేరు శనగ పప్పు.
నువ్వుల లడ్డూ తయారీ విధానం:
ముందుగా ఓ కడాయిలో నువ్వులను దోరగా వేయించి తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో వేరు శనగ పప్పులు కూడా వేయాలి. వేయించిన తర్వాత వీటిని బరకగా ఒకసారి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత పల్లీలు కూడా వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులోనే బెల్లం తురుము కూడా వేసి రుబ్బుకోవాలి. చాలా మంది పాకం తీసి నువ్వులను వేస్తారు. అలా చేస్తే ఉండలు చాలా గట్టిగా ఉంటాయి. అదే మిక్సీలో వేసి చుడితే చాలా మెత్తగా ఉంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఆ తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమంలో యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి కలపండి. కావాలి అనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంతో మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోండి. నువ్వుల లడ్డూలు ఇలా చేయడం వల్ల గట్టిగా కాకుండా మెత్తగా ఉంటాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. అంతే ఎంతో రుచిగా ఉండే నువ్వుల లడ్డూలు సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.