Mutton Keema: మటన్ కీమా ఇగురు ఇలా చేయండి.. ఎందులోకనా సూపర్ అంతే!

మటన్ కీమాతో ఎన్నో రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా స్నాక్ ఐటెమ్స్ తయారు చేస్తూ ఉంటారు. మటన్ కీమా చాలా రుచిగా ఉంటుంది. మటన్ కీమాను చాలా తేలికగా వండుకోవచ్చు. మటన్ కంటే మటన్ కీమా రుచే బాగుంటుంది. చపాతీ వంటి వాటితో తిన్నా, వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా రుచి వేరే లెవల్‌లో ఉంటుంది..

Mutton Keema: మటన్ కీమా ఇగురు ఇలా చేయండి.. ఎందులోకనా సూపర్ అంతే!
Mutton Keema Curry
Follow us
Chinni Enni

|

Updated on: Jan 03, 2025 | 7:23 PM

నాన్ ప్రియులకు ఎంతో ఇష్టమైన వాటిల్లో మటన్ కీమా కూడా ఒకటి. మటన్ కీమాతో ఎన్నో రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా స్నాక్ ఐటెమ్స్ తయారు చేస్తూ ఉంటారు. మటన్ కీమా చాలా రుచిగా ఉంటుంది. మటన్ కీమాను చాలా తేలికగా వండుకోవచ్చు. మటన్ కంటే మటన్ కీమా రుచే బాగుంటుంది. చపాతీ వంటి వాటితో తిన్నా, వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా రుచి వేరే లెవల్‌లో ఉంటుంది. ఈ పద్దతిలో చాలా సింపుల్‌గా మటన్ కీమా వండేయవచ్చు. మరి మటన్ కీమా ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూడండి.

మటన్ కీమా తయారీకి కావాల్సిన పదార్థాలు:

మటన్ కీమా, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్.

మటన్ కీమా తయారీ విధానం:

ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టండి. ఆయిల్ వెడెక్కగానే ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి కాస్త రంగు మారేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన మటన్ కీమా వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు మటన్‌లో, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న నీరంతా బయటకు పోయేంత వరకు పెద్ద మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి.. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కరివేపాకు కొద్దిగా వేసి అన్నీ ఓ ఐదు నిమిషాలు అయినా ఉడికించండి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి కనీసం ఓ ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే మటన్ కీమా కర్రీ సిద్ధం. ఇలా సింపుల్‌గా వండుకున్నా చాలా రుచిగా ఉంటుంది. చివరలో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ కర్రీ చపాతీ, నాన్స్, రోటీలు, చపాతీల్లోకి, బగారా రైస్‌, వేడి వేడి అన్నంలో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.