AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munakkaya Chepala Pulusu: మునక్కాయ చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే.. ఆహా అనాల్సిందే!

మునక్కాయ తిన్నా, చేపలు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. మునక్కాయలో, చేపల్లో శరీరానికి కావాల్సిన మంచి పోషకాలు ఉన్నాయి. అటు మునక్కాయకు, ఇటు చేపలకు ఫ్యాన్స్‌ ఎక్కువే. మరి ఈ రెండింటిని కలిపి పులుసు చేస్తే.. ఆహా అంటారు. అంటే టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్. సాధారణంగా బెండకాయ చేపల పులుసు వినే ఉంటారు. కానీ మునక్కాయ చేపల పులుసు కాంబినేషన్ మాత్రం వేరే లెవల్. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే.. ఆ రుచే వేరు. తినే కొద్దీ మరింత తినాలని..

Munakkaya Chepala Pulusu: మునక్కాయ చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే.. ఆహా అనాల్సిందే!
Munakkaya Chepala Pulusu
Chinni Enni
| Edited By: |

Updated on: Aug 03, 2024 | 6:30 PM

Share

మునక్కాయ తిన్నా, చేపలు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. మునక్కాయలో, చేపల్లో శరీరానికి కావాల్సిన మంచి పోషకాలు ఉన్నాయి. అటు మునక్కాయకు, ఇటు చేపలకు ఫ్యాన్స్‌ ఎక్కువే. మరి ఈ రెండింటిని కలిపి పులుసు చేస్తే.. ఆహా అంటారు. అంటే టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్. సాధారణంగా బెండకాయ చేపల పులుసు వినే ఉంటారు. కానీ మునక్కాయ చేపల పులుసు కాంబినేషన్ మాత్రం వేరే లెవల్. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే.. ఆ రుచే వేరు. తినే కొద్దీ మరింత తినాలని అనిపిస్తుంది. ఇది చేయడం కూడా చాలా సులభమే. మరి ఈ మునక్కాయ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

మునక్కాయ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు:

మునక్కాయలు, చేపలు, చింత పండు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కరివేపాకు, కొత్తి మీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర.

మునక్కాయ చేపల పులుసు తయారీ విధానం:

ముందుగా చేప ముక్కల్ని పసుపు, ఉప్పు వేసి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లి పాయలు, పచ్చి మిర్చి వేసి.. రంగు మారేంత వరకూ వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ రెండు నిమిషాలు ఆయిల్‌లో వేయించాలి. ఇది వేగాక మునక్కాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. మునక్కాయలు కూడా వేగాక.. టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

టమాటాలు మగ్గాక.. కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు చింత పండు రసం వేసి కలుపుకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడు పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసి ఉడికించుకోవాలి. మధ్యలో గరం మసాలా వేసి కలిపి.. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. పులుసు దగ్గర పడుతున్న సమయంలో కొద్దిగా కరివేపాకు, కొత్తి మీరే వేసి ఒక ఉడుకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ చేపల పులుసు సిద్ధం. ఒక్కసారి చేశారంటే.. మళ్లీ ఇలాగే చేసుకుని తింటారు. అంత రుచిగా ఉంటుంది. మునక్కాయ బదులు వంకాయ కూడా వేసుకోవచ్చు.

Follow Us