AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : పాక్ ప్లేయర్‌ మీదకు కోపంతో దూసుకెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. వద్దని వారించిన విహాన్

Vaibhav Suryavanshi : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అది ఒక యుద్ధంలాంటిదని మరోసారి నిరూపితమైంది. అండర్-19 ప్రపంచకప్‎లో భాగంగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

Vaibhav Suryavanshi : పాక్ ప్లేయర్‌ మీదకు కోపంతో దూసుకెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. వద్దని వారించిన విహాన్
Vaibhav Suryavanshi (1)
Rakesh
|

Updated on: Feb 02, 2026 | 6:45 PM

Share

Vaibhav Suryavanshi : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అది ఒక యుద్ధంలాంటిదని మరోసారి నిరూపితమైంది. అండర్-19 ప్రపంచకప్‎లో భాగంగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలుపోటముల కంటే మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా భారత యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, పాక్ ఆటగాడిపై కోపంతో ఊగిపోవడం సంచలనం రేపింది.

నిన్న జరిగిన కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం ఖాయమైన సమయంలో మైదానంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో అలీ బలోచ్ ఔట్ అయినప్పుడు ఈ గొడవ మొదలైంది. అంతకుముందు నుంచే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అలీ బలోచ్ ఔట్ కాగానే, వైభవ్ సూర్యవంశీ తీవ్ర ఆగ్రహంతో అతని వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పాక్ ఆటగాడు ఏదో వ్యాఖ్యలు చేయడం వల్లే సూర్యవంశీ అంతలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో సహచర ఆటగాడు విహాన్ మల్హోత్రా వెంటనే జోక్యం చేసుకుని వైభవ్‌ను పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.

సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేసుకుని క్రీడా స్ఫూర్తిని చాటుకుంటారు. కానీ ఈ మ్యాచ్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆట ముగిసిన వెంటనే రెండు జట్ల ఆటగాళ్లు తీవ్ర అసహనంతో కనిపించారు. ఎంతటి కోపం ఉన్నా కనీస మర్యాద పాటించకుండా, ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండానే మైదానాన్ని వీడారు. భారత్ సెమీఫైనల్‌కు చేరిన ఆనందంలో ఉన్నా, మైదానంలో జరిగిన ఈ సంఘటన క్రికెట్ ప్రేమికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

వైభవ్ సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయలు పలికి చరిత్ర సృష్టించాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ శైలి అందరినీ ఆకట్టుకుంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో అతని అగ్రెసివ్ బిహేవియర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు అతనికి ఉన్న దేశభక్తి, ఆవేశాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం అంతర్జాతీయ వేదికపై సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. ఏదేమైనా పాకిస్థాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరడం భారత అభిమానులకు పెద్ద పండగలా మారింది.

పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించిన టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్‌లో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు అజేయంగా కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న మన కుర్రాళ్ళు, మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడతారనే నమ్మకం అందరిలోనూ కనిపిస్తోంది. మైదానంలో జరిగిన ఈ గొడవను పక్కన పెట్టి, తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించాలని కోచ్‌ సూచించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..