AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mustard Seeds: ఆఫ్‌ట్రాల్‌ ఆవాలు.. అనుకుంటున్నారా.. ? ఈ బెనిఫిట్స్ తెలిస్తే ప్రతి కూరలోనూ వేస్తారు..

ఆవాలు వంటకు కేవలం అలంకారం కోసం మాత్రమే కాదు.. వాటి వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఆవాలలో మినరల్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, పాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని వ్యాధుల బారినపడకుండా ఉంచుతుంది. ఆవాలు మనలో రోగ నిరోధకతను పెంచుతాయి. ఈరోజు మనం ఆవాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Aug 05, 2024 | 4:26 PM

Share
Mustard Seeds

Mustard Seeds

1 / 5
ఆవాలు తినే వారిలో దంత సమస్యలు తక్కువగా వస్తాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పంటి నొప్పితో బాధపడేవారు. ఆవాలను మరిగించిన నీటిని తాగడం లేదా పుక్కిలించి ఉమ్మడం వంటివి చేస్తే పంటి నొప్పి త్వరగా తగ్గుతుంది. అవాలు రోజూ తినడం వల్ల మనకు తగిలిన గాయాలు త్వరగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఆవాలను పొడిలా చేసి ఆ పొడిని గాయాలపై పెట్టడం వల్ల కూడా త్వరగా గాయం నుంచి బయటపడవచ్చు.

2 / 5
చాలామంది కీళ్ల నొప్పుల వల్ల ఇబ్బంది పడుతుంటారు. దీని కారణంగా నడవలేకపోతుంటారు. అలాంటి వారు ఆవాలతో ఉపశమనం పొందొచ్చు. ఒక టీ స్పూన్ ఆవాల పొడి, కర్పూరం కలిపి మెత్తని పొడిలా చేయాలి. కాస్త నీళ్లు కలిపి పేస్టులా చేసి కీళ్లనొప్పులు వేధిస్తున్న చోట రాయాలి. ఇలా రాయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది. ఆవాల్లో ఉండే సెలీనియంతో థైరాయిడ్ పనితీరు సరిగ్గా ఉంటుంది. థైరాయిడ్ జీవక్రియకి హెల్ప్ అవుతుంది.

3 / 5
ఆవాల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల కణజాలాన్ని పెంచేందుకు మజిల్ హెల్త్‌కి పనిచేస్తుంది. మీరు తినే ఆహారంలో ఆవపిండిని ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల శరీరం వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని పొందుతుంది. జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా త్వరగా బయటపడేలా చేస్తుంది. గజ్జి, తామర వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆవాలను వినియోగించవచ్చు. ఆవాలు జీవక్రియని కూడా పెంచుతుంది.. వీటిని తీసుకుంటే మనం రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా కేలరీలు బర్న్ అవుతాయి. ఆవాల్లోని థర్మోజెనిసిస్‌ శరీరాన్ని వేడి చేసి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.

4 / 5
ఆవాలు కాస్త నీళ్లు వేసి మెత్తటి ముద్దలా నూరి ఆ మిశ్రమాన్ని గజ్జి, తామర వచ్చిన చోట పూయాలి. ఇలా తరచూ చేస్తే కచ్చితంగా నయం అవుతాయి. ఆవనూనెను శరీరం అంతా రాసుకొని కాసేపు ఎండలో కూర్చుంటే రికెట్స్ వ్యాధి తగ్గిపోతుంది. ఫుడ్ పాయిజన్ వల్ల పొట్టలో తిప్పుతున్నట్టు అనిపిస్తుంటే ఒక స్పూను ఆవపిండిని నీళ్లలో కలుపుకొని తాగేయాలి. ఇలా చేయడం వల్ల పొట్టలో ఉన్న ఆహారం వాంతి రూపంలో బయటికి వచ్చేస్తుంది. దీనివల్ల పొట్ట ప్రశాంతంగా ఉంటుంది.

5 / 5