AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules: మారిన ఫాస్టాగ్‌ రూల్స్‌.. ఈ తప్పు చేశారంటే చాలు మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌.. జాగ్రత్త!

కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ నియమాలలో మార్పులు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. కొత్త కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ఒక చిన్న పొరపాటు చేసినా ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేసే నియమాలను మార్చింది. అలాగే..

New Rules: మారిన ఫాస్టాగ్‌ రూల్స్‌.. ఈ తప్పు చేశారంటే చాలు మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌.. జాగ్రత్త!
New Traffic, Fastag Rules
Subhash Goud
|

Updated on: Feb 02, 2026 | 6:33 PM

Share

New Rules: దేశ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం టోల్‌లు, ట్రాఫిక్ నియమాలు, FASTag వ్యవస్థలో గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఈ కీలక నియమాలలో చాలా వరకు ఫిబ్రవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. కొత్త నియమాలు ట్రాఫిక్ ఉల్లంఘనలు, టోల్ బకాయిలకు సంబంధించి నియమాలను ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తోంది. అయితే అవి FASTag వినియోగదారులకు కొంత ఉపశమనం కూడా ఇస్తాయి.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం, FASTag వినియోగదారులకు ఫిబ్రవరి 1, 2026న లేదా ఆ తర్వాత జారీ చేసిన కొత్త FASTags కోసం KYC/KYV అవసరం లేదు. ముఖ్యంగా, కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్ వాహనాలకు “Know your vehicle (KYV)” ప్రక్రియ నిలిపివేసింది.

ఇది కూడా చదవండి: PM Kisan Scheme: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్‌ 22వ విడత వచ్చేది అప్పుడేనా..?

ఇవి కూడా చదవండి

అయితే ఇంకో విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఇప్పుడు టోల్ బకాయిలపై కఠినమైన వైఖరిని తీసుకుంటోంది. ఒక వాహనం టోల్‌ ప్లాజా వద్దకు రాగానే ఆటోమేటిక్‌గా ఫాస్టాగ్‌ నుంచి టోల్‌ ఛార్జీలు కట్‌ అవుతాయి. కానీ కొన్ని సందర్భాలలో సాంకేతిక సమస్య తలెత్తి టోల్‌ ఛార్జీ కట్‌ కాకుండా పెండింగ్‌లో చూపిస్తుంది. అలాంటి సమయంలో మీరు టోల్‌ ఛార్జీ బకాయి ఉన్నట్లే. ఈ వివరాలు కూడా ప్రభుత్వ రికార్డులలో నమోదు అవుతాయి. బకాయి ఉన్న సందర్భంలో వాహన యజమానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయరు. అంటే మీరు ఎవరికైనా వాహనం అమ్ముతున్నప్పుడు మీకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ను జారీ చేయరని అర్థం. అప్పుడు వాహనం విక్రయించేటప్పుడు ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకు మీ వాహనంపై ఏదైనా బకాయిలు ఉన్నట్లయితే వాటిని క్లియర్‌ చేయడం ముఖ్యం.

ఇది కూడా చదవండి: Silver Price: వెండి ధర రూ.2 లక్షలలోపు దిగి రానుందా? నిపుణులు ఏమంటున్నారు?

NOC పొందకపోవడం వాహన యజమానిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో వాహనాన్ని అమ్మడం అసాధ్యం, లేదా వాహనాన్ని వేరే రాష్ట్రంలో నమోదు చేయడం కూడా సాధ్యం కాదు. బకాయి ఉన్న టోల్‌ల కారణంగా వాహనం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కూడా తిరస్కరించవచ్చు. అలాగే ట్రక్కులకు జాతీయ అనుమతి లభించదు. ప్రభుత్వం NOCకి సంబంధించిన ఫారం 28ని కూడా సవరించింది. వాహన యజమానులు ఇప్పుడు ఈ ఫారంలో తమ వాహనంపై ఎటువంటి టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రకటించుకోవాలి. తప్పుడు సమాచారం అందించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Best Scooters: మహిళలకు అనుకూలంగా ఉండే 5 బెస్ట్‌ స్కూటర్లు ఇవే..!

టోల్‌తో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలపై కూడా కఠినమైన చర్యలు అమలు చేస్తోంది. మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఒక వాహనదారుడు ఒక సంవత్సరంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయవచ్చు. ఆర్టీవో, DTO లకు డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసే హక్కు ఉంటుంది.

ఇది కూడా చదవండి: FasTag Rule Change: వాహనదారులకు గుడ్‌న్యూస్.. కొత్త ఫాస్టాగ్‌ నియమాలు.. నేటి నుంచి అమలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి