Kodiguddu Pachi Karam: కోడిగుడ్డుతో పచ్చి కారం చేయండి..చాలా రుచిగా ఉంటుంది..
కోడిగుడ్డుతో చాలా రుచి కరమైన రెసిపీలు తిని ఉంటారు. ఈ సారి ఈ వంటకం కూడా తయారు చేయండి. అదే కోడి గుడ్డు పచ్చికారం. నోరు చప్పగా ఉన్నప్పుడు, ఏదన్నా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు, జ్వరంలో ఉన్నప్పుడు కూడా ఈ కర్రీ చేసుకుని వేడి వేడిగా తినవచ్చు..

కోడిగుడ్డు అంటే చాలా మందికి ఇష్టం. కోడి గుడ్డుతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. కోడి గుడ్డుతో ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఈజీగా అయిపోయే కర్రీస్‌లో గుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్డుతో చాలా రుచి కరమైన రెసిపీలు తిని ఉంటారు. ఈ సారి ఈ వంటకం కూడా తయారు చేయండి. అదే కోడి గుడ్డు పచ్చికారం. నోరు చప్పగా ఉన్నప్పుడు, ఏదన్నా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు, జ్వరంలో ఉన్నప్పుడు కూడా ఈ కర్రీ చేసుకుని వేడి వేడిగా తినవచ్చు. ఒక్కసారి కోడి గుడ్డు పచ్చికారం చేశారంటే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మరి కోడి గుడ్డు పచ్చికారం కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కోడి గుడ్డు పచ్చి కారానికి కావాల్సిన పదార్థాలు:
కోడి గుడ్డు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర తరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, ధనియాలు, పెరుగు, కసూరి మేతి, గరం మసాలా, ఆయిల్.
కోడి గుడ్డు పచ్చి కారం తయారీ విధానం:
ముందుగా కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టాలి. మిక్సీ తీసుకుని అందులో అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, ధనియాలు, పెరుగు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. బిర్యానీ ఆకులు వేసి వేగాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ బాగా వేగాక.. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి ఓ నిమిషం వేయించి నీళ్లు వేసి బాగా ఉడికించాలి. నీళ్లు వేశాక కోడి గుడ్లను కూడా వేసి ఉడికించాలి. కోడి గుడ్లను కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కర్రీ దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర, కసూరి మేతి చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కోడి గుడ్డు పచ్చికారం సిద్ధం.