Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు వైట్ రైస్ ఎక్కువగా తింటున్నారా..? అయితే ఇది మీకోసమే..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ఒకప్పుడు మన పూర్వీకులు సహజమైన ఆహారాలను ఎక్కువగా తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా వైట్ రైస్ తినేవారి సంఖ్య అయితే బాగా పెరిగిపోయింది. అయితే వైట్ రైస్ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు వైట్ రైస్ ఎక్కువగా తింటున్నారా..? అయితే ఇది మీకోసమే..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Brown Rice Benefits
Follow us
Prashanthi V

|

Updated on: Jan 31, 2025 | 8:57 PM

పూర్వకాలంలో మన పూర్వీకులు సహజమైన ఆహారాలను ఎక్కువగా తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ముఖ్యంగా వైట్ రైస్ తినే వారి సంఖ్య పెరిగిపోయింది. కానీ వైట్ రైస్ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బ్రౌన్ రైస్‌ ను తినమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ బ్రౌన్ రైస్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యం

బ్రౌన్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె సమస్యలను అరికడుతుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది.

వెయిట్ లాస్ కి బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోవడం తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల అధిక బరువుతో బాధపడే వారికి ఇది ఎంతో మంచిది.

డయాబెటిస్

డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్‌ను తింటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగవుతాయి.

జీర్ణవ్యవస్థకు మేలు

ఫైబర్ అధికంగా ఉండే బ్రౌన్ రైస్ జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది. మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యం

బ్రౌన్ రైస్‌లో మాంగనీస్ అధికంగా ఉండటంతో ఎముకల బలాన్ని పెంచుతుంది. దీని వల్ల వృద్ధాప్యంలో ఎముకల బలహీనత సమస్యలు తగ్గుతాయి.

ఎవరు తినకూడదంటే..?

బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైనదే అయినా కొంతమందికి అధిక ఫైబర్ వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు రావొచ్చు. అలాంటి వారు ఇది తినడం తగ్గించాలి.

మీ రోజువారీ ఫుడ్ డైట్ లో బ్రౌన్ రైస్‌ను చేర్చండి. ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగవడంతో పాటు బరువు నియంత్రణ, షుగర్ కంట్రోల్, జీర్ణవ్యవస్థ శుభ్రత, ఎముకల బలహీనత తగ్గింపు వంటి ప్రయోజనాలు లభిస్తాయి.