Kobbari Pala Pulao: కొబ్బరి పాలతో ఇలా బిర్యానీ చేస్తే.. అదిరిపోతుంది అంతే!
కొబ్బరి పాలతో ఎలాంటి వంటలు చేసినా సూపర్ టేస్టీగా ఉంటాయి. అంతే కాదు కొబ్బరి పాలతో ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అందుకే ఆహారంలో కొబ్బరి పాలను ఉపయోగిస్తారు. కొబ్బరి పాలతో జుట్టు, చర్మ సమస్యల్ని కూడా నయం చేసుకోవచ్చు. సాధారణంగా ఇప్పటివరకూ చికెన్ పులావ్, మటన్ పులావ్ తినే ఉంటారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బరి పాల పులావ్ ట్రై చేయండి. ఈ కొబ్బరి పాల పులావ్‌ని చికెన్, మటన్, ఎగ్ కర్రీలతో పాటు వెజిటేరియన్ కర్రీస్‌తో కూడా..

కొబ్బరి పాలతో ఎలాంటి వంటలు చేసినా సూపర్ టేస్టీగా ఉంటాయి. అంతే కాదు కొబ్బరి పాలతో ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అందుకే ఆహారంలో కొబ్బరి పాలను ఉపయోగిస్తారు. కొబ్బరి పాలతో జుట్టు, చర్మ సమస్యల్ని కూడా నయం చేసుకోవచ్చు. సాధారణంగా ఇప్పటివరకూ చికెన్ పులావ్, మటన్ పులావ్ తినే ఉంటారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బరి పాల పులావ్ ట్రై చేయండి. ఈ కొబ్బరి పాల పులావ్‌ని చికెన్, మటన్, ఎగ్ కర్రీలతో పాటు వెజిటేరియన్ కర్రీస్‌తో కూడా తినొచ్చు. ఈ పులావ్ కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఈ రెసిపీ ఇష్టపడి తింటారు. ఈ కొబ్బరి పులావ్‌ని ఎలా తయారు చేస్తారో చూద్దాం.
కొబ్బరి పాల పులావ్‌కు కావాల్సిన పదార్థాలు:
కొబ్బరి పాలు, బిర్యానీ సరుకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా గుజ్జు, బియ్యం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్.
కొబ్బరి పాల పులావ్ తయారు చేయు విధానం:
ముందుగా కొబ్బరి పాలను తయారు చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి మరోసారి మిక్సీ తిప్పి.. ఇందులో నుంచి కొబ్బరి పాలను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పులావ్ గిన్నె పెట్టుకుని.. ఆయిల్ వేసుకుని వేడి చేయాలి. నూనె వేడెక్కాక.. పులావ్ దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి.
ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేదాకా వేయించి.. ఇప్పుడు శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి చిన్న మంట మీద కలుపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పాలను, సరిపడా నీళ్లు, ఉప్పు వేసి బాగా కలపాలి. పైన మూత పెట్టి పావు గంట సేపు ఉడికిస్తే కొబ్బరి పాల పులావ్ రెడీ అయిపోతుంది. దీన్ని వెజ్ లేదా నాన్ వెజ్ కర్రీస్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులావ్‌ని వీకెండ్స్ లేదా స్పెష్పల్ డేస్‌లో చేసుకుని తింటే చాలా బావుంటుంది.