Talakaya Curry: తలకాయ కూర ఇలా ఒక్కసారి వండితే.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!
నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో తలకాయ కూర కూడా ఒకటి. తలకాయ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నం, రోటీ, చపాతి, రాగి సంగటి ఇలా దేనితో అయినా తినొచ్చు. తలకాయ కర్రీ రుచి కూడా కాస్త వేరుగా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తలకాయ కూరను వండుతూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది అనే చెప్పొచ్చు. దీన్ని ఎవరైనా చాలా ఈజీగా వండొచ్చు. కుక్కర్ లో అయితే ఇంకా సింపుల్ గా అవుతుంది. మరి కమ్మటి తలకాయ కూరను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు..

నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో తలకాయ కూర కూడా ఒకటి. తలకాయ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నం, రోటీ, చపాతి, రాగి సంగటి ఇలా దేనితో అయినా తినొచ్చు. తలకాయ కర్రీ రుచి కూడా కాస్త వేరుగా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తలకాయ కూరను వండుతూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది అనే చెప్పొచ్చు. దీన్ని ఎవరైనా చాలా ఈజీగా వండొచ్చు. కుక్కర్ లో అయితే ఇంకా సింపుల్ గా అవుతుంది. మరి కమ్మటి తలకాయ కూరను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తలకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు:
తలకాయ కూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, ఆయిల్, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, అనాస పువ్వు.
తలకాయ కర్రీ తయారీ విధానం:
ముందుగా తలకాయ కూరను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, అనాస పువ్వులను దోరగా వేయించి.. పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలను గుత్తి వంకాయలా కట్ చేసుకుని.. కాల్చి పక్కకు పెట్టుకోవాలి. ఆ నెక్ట్స్ ఎండు కొబ్బరి ముక్క కూడా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీలోకి వేసి.. పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసి.. బిర్యానీ ఆకు వేయగాక.. ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న తలకాయ కూర వేసి.. ఆయిల్‌లో బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, మసాలా పొడి, పసుపు వేసి బాగా కలపాలి, తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి.. ఆవిరి పోయాక మూత తీయాలి. ఇప్పుడు ఒకసారి అన్నీ రుచి చూసుకుని.. కరివేపాకు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కర్రీ సిద్ధం.