Mushroom Biryani: చెట్టినాడ్ స్టైల్‌లో మష్రూమ్ బిర్యానీ.. కుక్కర్‌లో ఈజీగా..

మష్రూమ్స్‌తో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఎక్కువగా స్నాక్ ఐటెమ్స్ తింటూ ఉంటారు. ఎలా చేసుకున్నా మష్రూమ్స్ వల్ల వంట రుచి పెరుగుతుంది. మష్రూమ్స్‌తో చెట్టినాడ్ స్టైల్‌లో ఈజీగా కుక్కర్‌లో బిర్యానీ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా రుచిగా, ఫ్లేవర్ ఫుల్‌గా ఉంటుంది..

Mushroom Biryani: చెట్టినాడ్ స్టైల్‌లో మష్రూమ్ బిర్యానీ.. కుక్కర్‌లో ఈజీగా..
Chettinad Style Mushroom Biryani
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 15, 2024 | 9:11 PM

మష్రూమ్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. మష్రూమ్ తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. పుట్టగొడుగులు కూడా రుచిగానే ఉంటాయి. మష్రూమ్ పూర్తిగా శాఖాహారం. మష్రూమ్స్‌తో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఎక్కువగా స్నాక్ ఐటెమ్స్ తింటూ ఉంటారు. ఎలా చేసుకున్నా మష్రూమ్స్ వల్ల వంట రుచి పెరుగుతుంది. మష్రూమ్స్‌తో చెట్టినాడ్ స్టైల్‌లో ఈజీగా కుక్కర్‌లో బిర్యానీ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా రుచిగా, ఫ్లేవర్ ఫుల్‌గా ఉంటుంది. మరి ఈ చెట్టినాడ్ స్టైల్‌ మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దం.

చెట్టినాడ్ స్టైల్‌ మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

పుట్టగొడుగులు, బాస్మతీ రైస్, పులావ్ దినుసులు, ఉల్లిపాయలు, టమాటా, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిర్చి, పచ్చి కొబ్బరి, ఎండు మిరపకాయ పేస్ట్, నూనె, నెయ్యి.

చెట్టినాడ్ స్టైల్‌ మష్రూమ్ బిర్యానీ తయారీ విధానం:

ఈ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా బాస్మతీ రైస్ కడిగి ఓ అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ లోపు ఈ బిర్యానీకి కావాల్సిన మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో.. పుదీనా, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిర్చి, పచ్చి కొబ్బరి, ఎండు మిరపకాయ పేస్ట్ వేసి అన్నీ మెత్తగా అయ్యేలా పేస్ట్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే నీళ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి, నూనె వేసి వేడి చేసి.. పులావ్ దినుసులు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీలో వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, ధనియాల పొడి వేసి ఓ నిమిషా ఫ్రై చేశాక.. కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగుల ముక్కలు కూడా వేసి ఓ ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం, సరిపడా వాటర్ వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి అంతా తగ్గాక మూత తీసి ఒకసారి కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ సిద్ధం. ఒకసారి మీరు కూడా చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?