AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana JRO Jobs: రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో దాదాపు 2 వేల వరకు ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది. ఈ పోస్టుల్లో కొన్నింటినీ గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా చేసిన వారితో భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటికి నోటిఫికేషన్ జారీ చేసి, రాత పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది..

Telangana JRO Jobs: రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Telangana JRO Jobs
Srilakshmi C
|

Updated on: Dec 31, 2024 | 9:07 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియామించేందుకు సర్కార్ అడుగులు వేస్తుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పేరిట పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. ఈ పోస్టుల భర్తీకి గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసి, ఇతర శాఖల్లోకి మార్చిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టుల్లో పనిచేసినవారు, వీఆర్‌ఏలుగా పనిచేస్తూ వివిధ శాఖల్లోకి పంపిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగిన మాజీ వీఆర్వో, వీఆర్‌ఏలను నేరుగా ఈ పోస్టుల కోసం రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు.

ఈ ప్రకారంగా చూస్తే రాష్ట్రంలో 3,600 మంది మాజీ వీఆర్వోలు, 2,000 మంది వరకు మాజీ వీఆర్‌ఏలకు అర్హత ఉన్నట్టు తేలింది. మిగతా సుమారు 5,300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇంటర్‌ పూర్తిచేసిన వారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్‌లో గణిత శాస్త్రం చదివిన వారిని కూడా నేరుగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పూర్తి చేసిన మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్‌ రెవెన్యూ అధికారి, సర్వేయర్‌ పోస్టుల్లో మిగిలిన వాటిని రాతపరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఈ పోస్టుల్లో చేరేందుకు మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏలు సుముఖత వ్యక్తం చేస్తేనే వారినే జూనియర్‌ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు.

2022కు ముందు రాష్ట్రంలో 5వేల మందికిపైగా ‘గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)’లు ఉన్నారు. అయితే రెవెన్యూ శాఖలో అవినీతిని నియంత్రించడానికి గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. ఆ పోస్టుల్లో ఉన్నవారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపింది. దాదాపు 70 మంది కోర్టును ఆశ్రయించగా వారంతా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నారు. మిగతా వారంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఇలా వివిధ శాఖల్లోకి వెళ్లిన వీఆర్‌ఏలలో కూడా సుముఖత వ్యక్తం చేసినవారిని మాత్రమే మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us