Aloo 65: పిల్లలకు నచ్చేలా ఆలూ 65.. టేస్ట్ మామూలుగా ఉండదు..

నాన్ వెజ్‌లోఎక్కువగా చికెన్‌తో ఎలా అయితే వెరైటీలు చేస్తాయో.. వెజ్‌లో ఆలు గడ్డతో కూడా అలాంటి వెరైటీ ఐటెమ్స్‌ తయారు చేస్తారు. ఆలు గడ్డతో చేసే ఐటెమ్స్.. చికెన్ తిన్న ఫీలింగే ఉంటాయి. అంత బావుంటాయి. ఆలుగడ్డతో చేసే స్నాక్స్ కూడా రుచిగా ఉండటమే కాకుండా.. చాలా సింపుల్‌గా తక్కువ సమయంలో అయిపోతాయి. ఇప్పుడు చేసే ఆలూ 65 బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. చెబుతుంటేనే నోరు ఊరుపోతుంది. ఇక ఇప్పుడు పిల్లలు స్కూల్స్ కి వెళ్తున్నారు కదా..

Aloo 65: పిల్లలకు నచ్చేలా ఆలూ 65.. టేస్ట్ మామూలుగా ఉండదు..
Aloo 65
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 29, 2024 | 7:43 PM

నాన్ వెజ్‌లోఎక్కువగా చికెన్‌తో ఎలా అయితే వెరైటీలు చేస్తాయో.. వెజ్‌లో ఆలు గడ్డతో కూడా అలాంటి వెరైటీ ఐటెమ్స్‌ తయారు చేస్తారు. ఆలు గడ్డతో చేసే ఐటెమ్స్.. చికెన్ తిన్న ఫీలింగే ఉంటాయి. అంత బావుంటాయి. ఆలుగడ్డతో చేసే స్నాక్స్ కూడా రుచిగా ఉండటమే కాకుండా.. చాలా సింపుల్‌గా తక్కువ సమయంలో అయిపోతాయి. ఇప్పుడు చేసే ఆలూ 65 బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. చెబుతుంటేనే నోరు ఊరుపోతుంది. ఇక ఇప్పుడు పిల్లలు స్కూల్స్ కి వెళ్తున్నారు కదా.. రాగానే స్నాక్స్ అడుగుతారు. వారి కోసం ఈజీగా అండ్ టేస్టీగా ఈ రెసీపీని చేయవచ్చు. దీంతో పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఇంత రుచిగా ఉండే ఆలూ 65 ఎలా తయారు చేస్తారు? ఆలూ 65కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆలూ 65కి కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన బంగాళ దుంపలు, మైదా, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి, పెరుగు, కొత్తి మీర, కరివేపాకు, కలర్, ఎండు మిర్చి, ఆయిల్.

ఆలూ 65 తయారీ విధానం:

ముందుగా బంగాళ దుంపల్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టాలి. అయితే ఇవి పూర్తిగా కాకుండా 70 శాతం ఉడకపెట్టాలి. ఇవి చల్లారాక పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలపై మైదా పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పచ్చి మిర్చి, కొత్తి మీర, కరివేపాకు, కలర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాక.. విడి విడిగా బంగాళ దుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇవి రెండు వైపులా ఎర్రగా వేయించాలి. గోధుమ రంగులోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టి.. అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, ఆవాలు, పచ్చి మిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాక.. కొద్దిగా పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు వేయించిన బంగాళ దుంపలు ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఆ పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ 65 సిద్ధం.

ధనుష్‌కు తమిళ నిర్మాతల షాక్.. ఇకపై ఆ కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే..
ధనుష్‌కు తమిళ నిర్మాతల షాక్.. ఇకపై ఆ కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే..
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!