గుమ్మడికాయ తొక్కలతో టేస్టీ టేస్టీ చిప్స్..! హెల్తీ స్నాక్ ఐటమ్స్ ఎలా చెయ్యాలంటే?
గుమ్మడికాయ తొక్కలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా మీరు బరువు తగ్గడంలో కూడా ప్రయోజనం పొందవచ్చు. ఇవి చాలా సేపు పొట్ట నిండుగా ఉంచుతాయి, తద్వారా మీరు అతిగా తినకుండా ఉంటారు. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా గుమ్మడికాయ చాలా మేలు చేస్తుంది.

ప్రోటీన్, ఐరన్, ఫైబర్, సోడియం మరియు కార్బోహైడ్రేట్లు వంటి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండే గుమ్మడికాయను సాధారణంగా చాలా ఇళ్లలో ఉపయోగిస్తారు. ఎక్కువగా దాంతో కూరలు, చారు, జ్యూస్ లేదంటే వడియాలు వంటివి చేసుకుని తింటుంటారు. ఇటీవలి కాలంలో గుమ్మడి గింజలు కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. గుమ్మడి గింజలతో ఆరోగ్య ప్రయోజనాల దృష్టా అనేక రకాలుగా వాటిని వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు గుమ్మడితో రుచికరమైన, ఆరోగ్యకరమైన చిప్స్ కూడా తయారు చేయవచ్చని మీకు తెలుసా. ఈ రోజు మనం గుమ్మడికాయ తొక్కతో చిప్స్ తయారు చేసే రెసిపీని తెలుసుకుందాం..ఇది పిల్లలతో పాటు పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. ఈ స్పైసీ మరియు క్రిస్పీ చిప్స్‌ని తయారుచేసే విధానం, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గుమ్మడికాయ చిప్స్ చేయడానికి కావలసినవి:
* గుమ్మడికాయ తొక్కలు – 2 కప్పులు
* నూనె – 4 స్పూన్లు
* కారంపోడి, లేదంటే మిరపకాయలు – 1 టీస్పూన్
* ఒరేగానో – 1 టీస్పూన్
* ఉప్పు – రుచికి తగినంత..
గుమ్మడికాయ చిప్స్ ఎలా తయారు చేయాలి..
గుమ్మడికాయ పీల్ చిప్స్ చేయడానికి, ముందుగా కావాల్సినన్ని గుమ్మడికాయ తొక్కలను బేకింగ్ ట్రేలోకి తీసుకోండి. ఇప్పుడు బ్రష్ సహాయంతో వాటిపై నూనె రాయండి. ఆ తరువాత అందులో ఉప్పు వేయండి. ఇప్పుడు దాని మీద చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో వేయండి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా కలపండి. ఆ తర్వాత మీరు ఓవెన్‌ను 180 డిగ్రీల వద్ద 5 నిమిషాలు వేడి చేయాలి. ఇప్పుడు ఈ ట్రేని ఓవెన్‌లో ఉంచి సుమారు 10 నిమిషాలు బేక్ చేయాలి. అంతే గుమ్మడికాయ తొక్కలతో చేసిన క్రిస్పీ చిప్స్ సిద్ధంగా ఉన్నాయి. వేడి టీ లేదా ఇష్టమైన చట్నీతో వాటిని ఆస్వాదించండి .
గుమ్మడికాయ ఆరోగ్యానికి ఔషధాల గని..
యాంటీఆక్సిడెంట్ల నిధి: ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్ వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు గుమ్మడికాయ తొక్కలలో కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో, వాటిని తీసుకోవడం ద్వారా మీరు ఫ్రీ రాడికల్ నష్టాన్ని నివారించవచ్చు. అదే సమయంలో, అవి సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: విటమిన్ ఇ, ఎ, ఐరన్, ఫోలేట్ వంటి అనేక పోషకాలతో కూడిన గుమ్మడికాయ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. దీని వినియోగం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
బరువు తగ్గడంలో కూడా మేలు చేస్తుంది: గుమ్మడికాయ తొక్కలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా మీరు బరువు తగ్గడంలో కూడా ప్రయోజనం పొందవచ్చు. ఇవి చాలా సేపు పొట్ట నిండుగా ఉంచుతాయి, తద్వారా మీరు అతిగా తినకుండా ఉంటారు. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా గుమ్మడికాయ చాలా మేలు చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..