Common Henna Mistakes: జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం కలిపితే సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..

మగువలు అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. చర్మం, జుట్టు రెండింటినీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలాగే కొంతమంది హోం రెమెడీస్ కూడా వినియోగిస్తుంటారు. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి అధిక మంది హెన్నా వినియోగిస్తుంటారు. హెన్నా జుట్టుకి మెరుపును పెంచడమేకాకుండా, తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చడంలో హెన్నా..

Common Henna Mistakes: జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం కలిపితే సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..
Common Henna Mistakes
Follow us

|

Updated on: Apr 16, 2024 | 12:13 PM

మగువలు అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. చర్మం, జుట్టు రెండింటినీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలాగే కొంతమంది హోం రెమెడీస్ కూడా వినియోగిస్తుంటారు. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి అధిక మంది హెన్నా వినియోగిస్తుంటారు. హెన్నా జుట్టుకి మెరుపును పెంచడమేకాకుండా, తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చడంలో హెన్నా ఉపయోగపడుతుంది. అయితే హెన్నా అప్లై చేస్తున్నప్పుడు కొంతమంది తెలిసో.. తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. అందులో వివిధ రకాల పదార్ధాలను కలుపుతుంటారు. దీనిని జుట్టుకి అప్లై చేస్తే జుట్టుకు హాని కలిగించే అనేక అంశాలు ఇందులో ఉంటాయి. జుట్టుకు హెన్నాను అప్లై చేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

నిమ్మ లేదా పెరుగు వద్దు

కొంతమంది హెన్నాలో నిమ్మరసం కలుపుతారు. కానీ అలా చేయడం సరికాదు. ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్లం అధికంగా ఉంటుంది. దీని కారణంగా జుట్టు పొడిబారడం ప్రారంభిస్తుంది. అదేవిధంగా చాలా మంది హెన్నాలో పెరుగు కూడా కలుపుతుంటారు. కానీ ఇవి కలపడం వల్ల మేలు కంటే హాని ఎక్కువ కలుగుతుంది. తక్కువ సమయంలో హెన్నాను తయారు చేసుకోని, జుట్టుకు మంచి రంగు రావాలంటే కనీసం 8 నుంచి 12 గంటల పాటు నానబెట్టిన తర్వాతే వాడాలి. ఇంతకంటే తక్కువ సమయం నానబెట్టినా సరైన ఫలితాలు రావు. హెన్నా రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉపయోగించవచ్చు.

ప్లాస్టిక్ గిన్నెలో కలపవద్దు

మనలో చాలా మంది ప్లాస్టిక్ గిన్నెలో హెన్నా కలుపుతారు. హెన్నాను మరచిపోయి కూడా ప్లాస్టిక్‌ గిన్నెల్లో కలపకూడదు. బదులుగా స్టెయిన్లెస్ స్టీల్ లేదా ఐరన్ బౌల్ ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎక్కువ రంగు విడుదలవుతుంది. అలాగే, హెన్నాను కలపడానికి గరిటెని ఉపయోగించాలి.

ఇవి కూడా చదవండి

 కాఫీ లేదా టీ నీటిని ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయ్

హెన్నా మిక్సింగ్ చేసేటప్పుడు చాలా మంది సాధారణ నీటిని ఉపయోగిస్తారు. అయితే దీని వల్ల జుట్టుకు హెన్నా రంగు సరిగ్గా పట్టదు. అందువల్ల హెన్నాను నానబెట్టడానికి సాధారణ నీటికి బదులుగా, కాఫీ లేదా టీ నీటిని ఉపయోగించవచ్చు. కానీ హెన్నాను నానబెట్టే ముందు టీ నీళ్లను చల్లబరచిన తర్వాత మాత్రమే నానబెట్టుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.