RCB vs SRH: 7 సిక్స్‌లు, 5 ఫోర్లు.. 230కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు ఖాయమన్న కోచ్
RCB coach Andy Flower: కార్తీక్ ఏడు మ్యాచ్‌ల్లో 156 పరుగులు చేశాడు. డీకే స్ట్రయిక్ రేట్ 194గా నిలిచింది. అందువల్ల ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అంతకుముందు రోహిత్ శర్మ కూడా అదే చెప్పడంతో కార్తీక్‌లో ఉత్సాహం మరింతగా కనిపిస్తోంది. ఇది తన ఆటలోనూ చూడొచ్చు.

Dinesh Karthik May Get Chance in T20 World Cup: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. 288 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి దినేష్ కార్తీక్ వెన్నుదన్నుగా నిలిచాడు. 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ ప్లేయర్‌గా ఈ తరహా ప్రదర్శన ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అతనికి టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది విని ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దినేష్ కార్తీక్ గతంలో టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఆయనకే సీటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. RCB కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా దినేష్ ఆటను మెచ్చుకున్నాడు. ‘టీ20 ప్రపంచకప్‌లో నీకు చోటు కల్పించాలనే రీతిలో మీరు ఆడుతున్నారు. నువ్వు రోజురోజుకూ మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నావ్’ అంటూ ప్రశంసలు కురిపించాడు.
Not many believed we could get anywhere close to the target but people in the dressing room did and DK didn’t let them down!
You’re a freak, DK. 🙇♂️#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvSRH pic.twitter.com/DAUfuT6YCN
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2024
బెంగళూరు స్టేడియంలో అందరూ డీకే.. డీకే అంటూ నినాదాలు చేశారు. కార్తీక్ 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 237.14. ప్రస్తుతం రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, ధృవ్ జురెల్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్ ప్రపంచకప్ వికెట్ కీపర్ రేసులో ఉన్నారు.
కార్తీక్ ఏడు మ్యాచ్‌ల్లో 156 పరుగులు చేశాడు. డీకే స్ట్రయిక్ రేట్ 194గా నిలిచింది. అందువల్ల ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అంతకుముందు రోహిత్ శర్మ కూడా అదే చెప్పడంతో కార్తీక్‌లో ఉత్సాహం మరింతగా కనిపిస్తోంది. ఇది తన ఆటలోనూ చూడొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..