AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

53 ఫోర్లు, 54 సిక్సర్లతో 699 పరుగులు.. వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతోంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించి.. 8 పాయింట్లతో పటిష్ట స్థితిలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది హైదరాబాద్ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌లో చూపించిన అగ్రెషన్‌.. ప్రత్యర్ధులను భయపెడుతోందని..

53 ఫోర్లు, 54 సిక్సర్లతో 699 పరుగులు.. వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
Rcb Vs Srh
Ravi Kiran
|

Updated on: Apr 16, 2024 | 11:15 AM

Share

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతోంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించి.. 8 పాయింట్లతో పటిష్ట స్థితిలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది హైదరాబాద్ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌లో చూపించిన అగ్రెషన్‌.. ప్రత్యర్ధులను భయపెడుతోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సోమవారం బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు శివతాండవం ఆడారు. 15 రోజుల క్రితం నెలకొల్పిన రికార్డును.. బెంగళూరులో తుడిచిపెట్టేసి.. ఐపీఎల్ చరిత్రలోనే మరో అరుదైన రికార్డు సృష్టించింది ఆరెంజ్ ఆర్మీ. ఈ లీగ్‌లో రెండు అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అవతరించింది. అంతకముందు 277 పరుగులు చేసిన హైదరాబాద్, ఇప్పుడు 287 పరుగులు చేసి చరిత్ర తిరగరాసింది.

ఈసారి ఐపీఎల్ వేలంలో కావ్య మారన్‌ వ్యూహాలు ఫలించాయని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్, కమిన్స్ లాంటి క్రికెటర్లను కొనడంతో.. ఇప్పుడు ఆ ఇద్దరే జట్టుకు కీ-ప్లేయర్స్‌గా మారారు. ఆర్సీబీపై ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు చేయగా.. ప్రత్యర్ధి టీంలో బౌలర్ ఎవరైనా కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఐదు మ్యాచులాడిన హెడ్.. 235 పరుగులు చేశాడు. ఇందులో 1 అర్ధ సెంచరీ, 1 సెంచరీ ఉండటం విశేషం. హైదరాబాద్‌కు మొదటి ఓవర్‌ నుంచి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడంలో హెడ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇక హెన్రిచ్ క్లాసెన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోడి విధ్వంసం ముందు ప్రత్యర్ధి బౌలర్లు తలవంచాల్సిందే. తన బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లో బెస్ట్ ఫినిషర్‌గా పేరు సంపాదించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో క్లాసెన్ 253 పరుగులు చేశాడు. ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా 24 సిక్సర్లు బాదేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం 9 ఫోర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ లెక్కలు చూస్తే మనోడు మిగతా జట్లకు యముడని చెప్పొచ్చు. అటు యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కూడా దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేశాడు. మరోవైపు ప్యాట్ కమిన్స్ నాయకత్వం హైదరాబాద్‌కు ప్లస్ పాయింట్ అయింది. క్లిష్ట పరిస్థితుల్లో కమిన్స్ తీసుకునే నిర్ణయాలు హైదరాబాద్‌కు విజయాన్ని అందించడంలో తోడ్పడుతున్నాయి. అటు బౌలింగ్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు కమిన్స్. ఇలా ఆడితే.. హైదరాబాద్ కప్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.